Home> ఆధ్యాత్మికం
Advertisement

Jyeshta Amavasya 2023: జ్యేష్ఠ అమావాస్య, వట్ సావిత్రి వ్రతం, శని జయంతి ఒకే రోజు.. శుభ ముహూర్తం తెలుసుకోండి..

 Jyeshta Amavasya 2023: జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజున స్నానం, దానం, పూర్వీకులకు తర్పణాలు వదలడం శుభప్రదంగా భావిస్తారు. ఈ అమావాస్య ఎప్పుడు వస్తుంది, ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోండి.
 

 Jyeshta Amavasya 2023: జ్యేష్ఠ అమావాస్య, వట్ సావిత్రి వ్రతం, శని జయంతి ఒకే రోజు.. శుభ ముహూర్తం తెలుసుకోండి..

Jyeshta Amavasya 2023 date: హిందూ మతంలో అమావాస్య తిథికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇందులో జ్యేష్ఠ అమావాస్య చాలా ముఖ్యమైనది. పైగా ఇదే రోజు వట్ సావిత్రి వ్రతం, శని జయంతి కూడా వస్తుంది. అమావాస్య తిథికి అధిపతి పిత్రుడు. జ్యేష్ఠ అమావాస్య నాడు స్నానం, దానం, పూర్వీకులకు తర్పణాలు వదలడం వల్ల మీకు పూర్వీకుల ఆశీస్సులతోపాటు దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. జ్యేష్ఠ అమావాస్య యొక్క పవిత్రమైన తిథి, శుభ సమయం మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి. 

జ్యేష్ఠ అమావాస్య ఎప్పుడు
జ్యేష్ఠ అమావాస్య తిథి మే 18న రాత్రి 9.42 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మే 19న రాత్రి 9.22 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం జ్యేష్ఠ అమావాస్య మే 19వ తేదీ శుక్రవారం నాడు జరుపుకోనున్నారు. ఈ రోజున స్నానం చేసి ఉపవాసం ఉండటం వల్ల మీ పాపాలు నశించడంతోపాటు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. సూర్యాస్తమయం తర్వాత శని దేవుడిని పూజించడం శ్రేయస్కరంగా భావిస్తారు. 

స్నాన సమయం - ఉదయం 05:15 నుండి ఉదయం 04:59 వరకు ఉంటుంది.
వట్ సావిత్రి పూజ ముహూర్తం - ఉదయం 05.43 నుండి 08.58 వరకు ఉంటుంది.
శనిదేవుడి పూజ ముహూర్తం - సాయంత్రం 06:42 నుండి రాత్రి 07:03 వరకు ఉంటుంది.

జ్యేష్ఠ అమావాస్య పూజ విధానం
ఈ రోజున నదీస్నానం చేసి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించండి. ఈరోజున పిండ దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. అనంతరం పేదవారికి దానం మరియు దక్షిణ కూడా ఇవ్వండి. శనిదేవుడికి ఆవాల నూనె, నల్ల నువ్వులు, నల్ల బట్టలు మరియు నీలిరంగు పువ్వులు సమర్పించి శని చాలీసాను పఠించండి. వట్ సావిత్రి వ్రతం పాటించే స్త్రీలు ఈ రోజు యమ దేవతను పూజించాలి. 

Also Read: Vrishabha Sankranti 2023: వృషభ సంక్రాంతి ఎప్పుడు? స్నాన, దాన సమయం తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More