Home> ఆధ్యాత్మికం
Advertisement

Jupiter Transit 2023: ఏప్రిల్ లో ఈ 5 రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం, పదవి.. ఇందులో మీది ఉందా?

Guru Gochar 2023: ఏప్రిల్‌లో దేవగురువు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. గురు రాశి మార్పు కారణంగా 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 
 

Jupiter Transit 2023: ఏప్రిల్ లో ఈ 5 రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం, పదవి.. ఇందులో మీది ఉందా?

Jupiter Transit 2023 effects : జ్యోతిష్యం ప్రకారం, దేవగురువు బృహస్పతి పుష్కర కాలం తర్వాత మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది 2023 సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన గ్రహ సంచారాలలో ఒకటి. ఏప్రిల్ 22, ఉదయం 04:42 గంటలకు బృహస్పతి మేషరాశిలో సంచరించనున్నాడు. అదే రాశిలో మే 1, 2024 వరకు ఉంటాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. గురు సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.

బృహస్పతి సంచారం ఈ రాశులకు వరం 
మేషం: గురుగ్రహ సంచారం మేష రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. మీ కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 
మిథునం : గురుగ్రహం రాశి మారడం వల్ల మిథున రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుుకంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. 
సింహ రాశి: బృహస్పతి సంచారం వల్ల సింహ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు రుణవిముక్తి పొందుతారు. మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. 

కన్య: బృహస్పతి సంచారం వల్ల కన్యా రాశి వారి లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీరు మీ ప్రణాళికలను అమలు చేయడంలో విజయం సాధిస్తారు. దాంపత్య జీవితంలో ఆనందం నెలకొంటుంది. మీరు మతపరమైన యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
మీనం: దేవగురువు మేషరాశి ప్రవేశం మీనరాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. మెుత్తానికి ఈసమయం మీనరాశివారికి కలిసి వస్తుంది.

Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More