Home> ఆధ్యాత్మికం
Advertisement

Guru Gochar 2023: వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు మేషరాశిలోనే గురుడు.. ఈ 5 రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు..

Jupiter transit 2023: ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో ప్రయాణం చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు అదే రాశిలో సంచరిస్తాడు. మేషరాశిలో గురుడు సంచారం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇది 5 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. 
 

Guru Gochar 2023: వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు మేషరాశిలోనే గురుడు.. ఈ 5 రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు..

Guru Rashi Parivartan 2023: ఆస్ట్రాలజీలో దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ఇతడిని అదృష్టం మరియు సంతానానికి కారకుడిగా పరిగణిస్తారు. ఏడాదికొకసారి గురుడు తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నాడు. జాతకంలో గురుడు శుభస్థానంలో ఉంటే వారి లైఫ్ బిందాస్ గా ఉంటుంది. అశుభ స్థానంలో ఉంటే మీ లైఫ్ దుఃఖమయం అవుతుంది. మేషరాశిలో బృహస్పతి సంచారం రాబోయే 11 నెలలుపాటు 5 రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

మేషం: ప్రస్తుతం ఇదే రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. దీంతో  ఈ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. 
సింహ రాశి: గురుడు సంచారం సింహ రాశి వారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. మీ లక్ కలిసి వచ్చి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీకు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 
కన్యా రాశి : బృహస్పతి సంచారం కన్యా రాశి వారికి ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. 

Also Read: Chandra Grahan 2023: అశ్వినీ నక్షత్రంలో ఏర్పడబోతున్న చంద్రగ్రహణం.. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి...

తుల: బృహస్పతి తుల రాశి వారికి ఊహించని ధనాన్ని ఇస్తాడు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది.  
మీనం: గురుడు మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆఫీసులో సీనియర్లు సహకారం అందుతుంది. బంధువులతో వివాదాలు తొలగిపోయి ఆస్తి మీ చేతికి చిక్కుతుంది. మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తిలో మీరు విజయం సాధిస్తారు. 

Also Read: Mercury transit 2023: మరో 24 గంటల్లో ఈ రాశుల వారు ధనవంతులవ్వడం పక్కా.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More