Home> ఆధ్యాత్మికం
Advertisement

Jupiter transit 2023: 12 ఏళ్ల అనంతరం గురుడి రాశి గోచారం, అంతా కనకవర్షమే, ఉద్యోగ వ్యాపారాల్లో వృద్ధి

Jupiter transit 2023: జ్యోతిష్యం ప్రకారం గురుగ్రహం ఈ ఏడాది మీనరాశి నుంచి బయటికొచ్చి మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా కొన్ని రాశులకు ఊహించని ధన లాభం, ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుత వృద్ధి కన్పించనుంది. ఆ వివరాలు మీ కోసం..
 

Jupiter transit 2023: 12 ఏళ్ల అనంతరం గురుడి రాశి గోచారం, అంతా కనకవర్షమే, ఉద్యోగ వ్యాపారాల్లో వృద్ధి

జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంది. ఫలితంగా  వివిధ జాతకాలపై ప్రభావం పడుతుంటుంది. ఏప్రిల్ 22వ తేదీన గురుడు మీనరాశి నుంచి మంగళ గ్రహ రాశి మేషంలో ప్రవేశించననున్నాడు. ఈ సందర్భంగా మొత్తం 12 రాశుల జాతకాల జీవితంపై శుభ, అశుభ ప్రభావం కన్పించనుంది.

మేషరాశిలో గురుడు ఏంగా 12 ఏళ్ల తరువాత గోచారం చేయనున్నాడు. దాంతో ఈ గోచారానికి అత్యంత ప్రాధాన్యత, మహత్యం ఏర్పడింది. గురు గోచారంతో ఏయే రాశులపై ధనలాభం, కెరీర్‌పరంగా వృద్ధి ఉండనుందో తెలుసుకుందాం..ముఖ్యంగా మేషరాశి, కర్కాటక రాశి, మీన రాశి జాతకులకు ఊహించని ధనలాభం కలగనుంది. 

మేషరాశి

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువు మేషరాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి జీవితంలో శుభ ఫలాల వసంతమే కురవనుంది. ఈ గోచారం ఈ రాశి లగ్నపాదంలో ఉండనుంది. ఈ క్రమంలో మీకు పనిచేసే చోట శక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు పటిష్టమౌతాయి. ఈ సమయంలో పెళ్లికానివారికి సంబంధాలు వస్తాయి. వ్యాపారులకు కూడా ఈ సమయం లాభాల్ని ఆర్జింపచేస్తుంది. భాగస్వామ్య వాపారం చేసేవారికి ఈ సమయం అత్యంత అనుకూలం. 

కర్కాటక రాశి

జ్యోతిష్యుల ప్రకారం గురు గ్రహం గోచారంతో కర్కాటక రాశి జాతకులకు విశేషలాభాలు కలగనున్నాయి. ఈ గోచారం కర్కాటక రాశివారికి గోచారం కుండలిలో కర్మపాదంలో ఉంటుంది. ఈ పాదాన్ని ఉద్యోగం, పనిచేసే ప్రాంతపు స్థానంగా భావిస్తారు. ఈ క్రమంలో ఈ జాతకులకు ఆర్ధిక లాభాలు కలుగుతాయి. కెరీర్ ప్రారంభించేవారికి అత్యంత శుభసమయం. మంచి మంచి ఉద్యోగాల ఆఫర్లు లభిస్తాయి. అటు వ్యాపారులకు లాభాలు ఆర్జించేందుకు మంచి అవకాశముంటుంది. ఉద్యోగులకు ఈ సమయంలో పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

మీనరాశి

గురుడు మీనరాశి నుంచి మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ క్రమంలో మీనరాశివారికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి జాతకులకు గోచారం కుండిలో రెండవపాదంలో ఉండనుంది. ఈ స్థానాన్ని ధనానికి ప్రతీకగా భావిస్తారు. ఈ క్రమంలో మీనరాశి జాతకులకు ఊహించని ధనలాభం కలుగుతుంది. ఉన్నత చదువులు చదివేందుకు విదేశాలకు వెళ్లే యోగం ఉంటుంది. నిలిచిపోయిన డబ్బులు లభించేందుకు పూర్తి అవకాశాలున్నాయి.

Also read: Mahashivratri 2023: మహా శివరాత్రి నాడు శివుడిని ఎలా పూజిస్తే మంచిది, ఏ రంగు పూలు అర్పించాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More