Home> ఆధ్యాత్మికం
Advertisement

Jupiter transit 2023: అరుదైన గజలక్ష్మి రాజయోగం.. 2023లో ఈ రాశుల వారికి వ్యాపార, ఉద్యోగాల్లో తిరుగుండదు..

Gajlaxmi Rajyog In 2023: బృహస్పతి సంచారం వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. 
 

Jupiter transit 2023: అరుదైన గజలక్ష్మి రాజయోగం.. 2023లో ఈ రాశుల వారికి వ్యాపార, ఉద్యోగాల్లో తిరుగుండదు..

Gajlaxmi Rajyog In 2023: జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి గ్రహాన్ని దేవతల గురువు అని పిలుస్తారు. ఎవరి జాతకంలో బృహస్పతి శుభ స్థానంలో ఉంటాడో  ఆ వ్యక్తి అపారమైన సంపదతోపాటు కీర్తిని గడిస్తారు. కొత్త ఏడాదిలో గురుడు మీన రాశి నుండి మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా అరుదైన గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మేషం (Aries): గజలక్ష్మీ రాజయోగం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.  ఉద్యోగులు ఆఫీసులో కొత్త బాధ్యతను తీసుకుంటారు. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. కోర్టు కేసులలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మెుత్తానికి ఈ సమయం మీకు సూపర్ గా ఉంటుంది. 

ధనుస్సు (Sagittarius):  గజలక్ష్మి రాజయోగం వల్ల మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. వ్యాపారంలో విజయం లభిస్తుంది.  కుటుంబ సంబంధాలు బలపడతాయి. చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. 

మిథునం (Gemini): గజలక్ష్మి రాజయోగం వల్ల మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. స్టాక్ మార్కెట్ , బెట్టింగ్ , లాటరీల్లో పెట్టుబడి పెట్టేవారు లాభపడతారు. వ్యాపారంలో మీరు పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. బ్యాంకింగ్, మీడియా లేదా విద్యా రంగంతో సంబంధం ఉన్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Venus transit 2022: మకరరాశిలో శుక్రుడి ప్రవేశం... ఈ 4 రాశులవారు జాగ్రత్త.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Read More