Home> ఆధ్యాత్మికం
Advertisement

Gajkesari Rajyog: మీనరాశిలో గజకేసరి రాజయోగం.. ఈ రాశులవారి డబ్బు సంచులు నిండటం ఖాయం!

Jupiter Moon Conjunction 2022: ఆస్ట్రాలజీలో ఒక గ్రహం మరోక గ్రహంతో కలవడాన్ని యుతి లేదా సంయోగం అంటారు. సెప్టెంబరు 11న గురు, చంద్రుల కలయిక వల్ల ఈ రాశులవారు అపారమైన ప్రయోజనాలు పొందనున్నారు. 
 

Gajkesari Rajyog: మీనరాశిలో గజకేసరి రాజయోగం.. ఈ రాశులవారి డబ్బు సంచులు నిండటం ఖాయం!

Jupiter Moon Conjunction 2022: అంతరిక్షంలో గ్రహాల మార్పు ప్రభావం ప్రతి ఒక్కరిపై పడుతుంది. అంతేకాకుండా గ్రహాల సంచారం, తిరోగమనం, సంయోగం కూడా అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. ప్రస్తుతం బృహస్పతి మీనరాశిలో ఉన్నాడు. రెండు రోజుల కిందట అంటే సెప్టెంబర్ 11 రాత్రి చంద్రుడు మీనంలోకి ప్రవేశించాడు. మీనరాశిలో ఈ రెండింటి కలయికతో గజకేసరి రాజయోగం (Gajkesari Rajyog in Pisces 2022) ఏర్పడింది. అయితే ఈ యోగం వల్ల మూడు రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

వృషభం (Taurus)- గజకేసరి యోగం ఈ రాశి వారికి మేలు చేస్తుంది. ఈ యోగం వృషభ రాశి 11వ ఇంట్లో ఏర్పడుతోంది. ఇది ఆదాయం, లాభాల యెుక్క ఇల్లుగా పరిగణిస్తారు.  దీంతో ఈ రాశివారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారులు కొత్త ఆర్డర్లు అందుకుంటారు, తద్వారా భారీ లాభాలను ఆర్జిస్తారు. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. 

కర్కాటకం (Cancer)- బృహస్పతి మరియు చంద్రుల కలయికతో ఏర్పడిన గజకేసరి రాజయోగం ఈ రాశుల వారి జీవితాలను మారుస్తుంది. ఈ రాశుల సంచార జాతకంలో తొమ్మిదో స్థానంలో ఈ యోగం ఏర్పడుతోంది. ఈరాశివారికి లక్ కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఈ సమయం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కలిసి వస్తుంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

వృశ్చికం (Scorpio)- ఈ రాశి వారికి ఈ యోగం లాభాలను తెస్తుంది.  బృహస్పతి మరియు చంద్రుల సంయోగం ఈ ఇంటిలోని ఐదో ఇంట్లో ఏర్పడుతోంది. దీంతో మీకు ఆకస్మిక ధన లాభం కలుగవచ్చు. పిల్లలవైపు నుంచి శుభవార్తలు వింటారు. సంతానం పొందే అవకాశం కూడా ఉంది. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుంది. విద్యారంగానికి సంబంధించిన వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Dussehra 2022: దసరా ఎప్పుడు, శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More