Home> ఆధ్యాత్మికం
Advertisement

Lucky Zodiac Sign: మరో 2 రోజుల తర్వాత ఈ 5 రాశులకు అదృష్టం.. మీరున్నారా?

July 2023 Horoscope: మరో రెండు రోజుల్లో జూలై నెల ఆరంభం కానుంది. ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల తమ రాశులను మార్చున్నాయి. దీని వల్ల 5 రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 
 

Lucky Zodiac Sign: మరో 2 రోజుల తర్వాత ఈ 5 రాశులకు అదృష్టం.. మీరున్నారా?

Lucky Zodiac Sign in July 2023: జూలై నెల మెుదలుకావడానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రహాల సంచారం పరంగా జూలై నెల చాలా ప్రత్యేకమైనది. జూలై 01న కుజుడు, 07న శుక్రుడు, 08న బుధుడు తమ రాశులను మార్చనున్నారు. ఈ మూడు గ్రహల రాశి మార్పు ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. ఈసమయంలో ముఖ్యంగా 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

కుంభ రాశి
జూలై నెల కుంభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రహాల సంచారం వల్ల వీరు భారీగా ధనాన్ని పొందుతారు. కమ్యూనికేషన్ మరియు మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభవార్త వింటారు. మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. 
సింహ రాశి
పెండింగ్‌లో ఉన్న ఈ రాశి వారి పనులు జూలైలో పూర్తవుతాయి. వచ్చే నెల ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో ఏ పని లేదా వ్యాపారం ప్రారంభించినా మంచి లాభాలు పొందుతారు. 
మేషరాశి
గ్రహాల రాశి మార్పు వల్ల మేషరాశి వారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేదంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది.

Also Read: Samsaptak Yog: సింహరాశిలో రెండు భయంకరమైన గ్రహాల కలయిక.. ఈ 3 రాశులవారి జీవితం అల్లకల్లోలమే ఇక..

తులారాశి
జూలై మాసంలో తులరాశి వారు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
వృషభం
వృషభ రాశి వారికి ఈ నెల గొప్పగా ఉంటుంది. మీ పిల్లలు చదువులో రాణిస్తారు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

Also Read: Bakrid Quotes: ఈదుల్ అదా ప్రాముఖ్యత ఏంటి, బక్రీద్‌కు ఎలాంటి విషెస్ చెప్పాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More