Home> ఆధ్యాత్మికం
Advertisement

Amarnath Yatra Dates: అమర్‌నాథ్ యాత్ర తేదీలు ఖరారు, జూన్ 30 నుంచి 43 రోజులు సాగనున్న యాత్ర

Amarnath Yatra Dates: హిందూవులు అత్యంత పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాల్లో అమర్‌నాథ్ ఒకటి. సహజసిద్ధంగా మంచుతో ఏర్పడే శివలింగం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర తేదీల్ని ప్రభుత్వం ఖరారు చేసింది. 

Amarnath Yatra Dates: అమర్‌నాథ్ యాత్ర తేదీలు ఖరారు, జూన్ 30 నుంచి 43 రోజులు సాగనున్న యాత్ర

Amarnath Yatra Dates: హిందూవులు అత్యంత పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాల్లో అమర్‌నాథ్ ఒకటి. సహజసిద్ధంగా మంచుతో ఏర్పడే శివలింగం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర తేదీల్ని ప్రభుత్వం ఖరారు చేసింది. 

జమ్ముకశ్మీర్‌లోని అమర్‌నాథ్ దేవాలయం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. వేసవి తప్ప మిగిలిన రోజుల్లో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది ఈ ఆలయం. వెళ్లేందుకు మార్గాలన్నీ మూసుకుపోతాయి. ప్రతియేటా కేవలం వేసవిలో నిర్ణీత సమయంలో మాత్రమే ఈ ఆలయం తెర్చుకుంటుంది. సహజసిద్ధంగా మంచుతో ఏర్పడిన శివలింగం ఈ ఆలయం ప్రత్యేకత.

అందుకే ఎన్నో వ్యయప్రయాసలతో పెద్దఎత్తున భక్తులు చేరుకుంటుంటారు. అదే అమర్‌నాథ్ యాత్ర. గుహలో మంచుతో ఏర్పడిన శివలింగాన్ని శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. ప్రతియేటా వేలాదిమంది భక్తులు సందర్శిస్తుంటారు. శ్రీనగర్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్‌నాథ్..దేశంలోని ప్రసిద్ధ తీర్థయాత్రా స్థలాల్లో ఒకటి. సముద్రమట్టానికి 4175 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం శివభక్తులకు ప్రత్యేకం. అమర్ అంటే అమరుడు, నాథ్ అంటే దేవుడు. ఈ రెండు పదాల కలయికే అమర్‌నాథ్. హిందూ విశ్వాసాల ప్రకారం..శివుడి అర్ధభాగమైన పార్వతీ దేవి...అమరత్వం రహస్యాలు బహిర్గతం చేయాలని శివుడిని కోరిందట. ఈ రహస్యం మరెవరి చెవినా పడకుండా ఉండేందుకు హిమాలయాల్లో ఏకాంతంలో ఉన్న ఈ గుహలకు తీసుకెళ్లి జీవిత రహస్యాల్ని వెల్లడించాడని ప్రతీతి. 

ఈ ఏడాది 2022కు సంబంధించి అమర్‌నాథ్ యాత్ర తేదీల్ని అమర్‌నాథ్ ఆలయ బోర్టు ప్రకటించింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన  బోర్డు సమావేశంలో యాత్ర తేదీల్ని వెల్లడించారు. జూన్ 30 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకూ 43 రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది. 

Also read: Vastu Tips For Floor: కొత్త ఇంట్లో టైల్స్ లేదా మార్బుల్స్ అమర్చేటప్పుడు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More