Home> ఆధ్యాత్మికం
Advertisement

Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

Interesting Facts About Dreams |జ్యోతిష్కులు కలల సంజ్ఞలకు పలు రకాల అర్థాలు ఉంటాయని చెబుతారు. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో మనం చూసే కొన్ని విషయాలు జీవితంలో నిజం అవుతాయి. 

Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

కొందరు తమకు కలలో వచ్చిన విషయాలు చెబితే కుటుంబసభ్యులు, స్నేహితులు ఆశ్చర్యపోయారు. కొన్నిసార్లు కొన్ని విషయాలు విని పగటికలలు కంటున్నావా ఏంటి అని మందలించే ప్రయత్నం చేస్తారు. కలలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతకుమించిన ఆసక్తి కలలపై నెలకొంది. అయినప్పటికీ, జ్యోతిష్కులు, స్వప్న శాస్త్ర నిపుణులు కలల సంజ్ఞలకు పలు రకాల అర్థాలు ఉంటాయని చెబుతారు. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో మనం చూసే కొన్ని విషయాలు జీవితంలో నిజం అవుతాయి. కలలో కొన్ని మీకు కనిపిస్తే అది అరిష్టంగా భావిస్తారు. కొందరకి కలలో తరచుగా కొన్ని జంతువులు, పక్షులు సైతం కనిపిస్తాయి. 

1. కలలో ఆవు కనిపిస్తే..
స్వప్న శాస్త్రం ప్రకారం, కలలు రావడంతో కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తాయి. కల ఆధారంగా మంచి, చెడు అంచనా వేస్తారు. ఆవు రూపం కలలో కనిపించిందంటే ఆ వ్యక్తికి దేవుడి పట్ల భక్తి ఉంటుంది. ఆ వ్యక్తి దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆవు మీకు కలలో కనిపిస్తే, ఆ సమయంలో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

Also Read: COVID-19: కరోనా వైరస్ ఎంత సమయంలో వ్యాపిస్తుందో తెలుసా, నిపుణులు ఏం చెప్పారంటే

2. కలలో ఏనుగు కనిపిస్తే..
కొందరికి కలలో గజరాజు(Elephant) తరచుగా కనిపిస్తుంది. అయితే మీకు కలలో ఏనుగు వస్తే, మీ దశ తిరగనుందని అర్థం. ఏదో విధంగా మీకు ధనలాభం గోచరిస్తుంది. మీరు త్వరగా ధనవంతులు కాబోతున్నారని సంకేతం. లేదా మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. 

3. గుడ్లగూబ వచ్చిందా..
గుడ్లగూబను కొందరు దేవతల వాహనంగా భావిస్తారు. కలలో గుడ్లగూబ కనిపించినట్లయితే, మీకు ధనధాన్యం చేతికి అంది వస్తుంది. కలలో గుడ్లగూబ కనిపిస్తుందంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించనుంది.

4. సర్పాలు కనిపిస్తే..
హాయిగా నిద్రిస్తున్నా మీకు కలలో పాము(Snakes) కనిపించిందంటే ఉలిక్కిపడి లేస్తారు. కలలో పాము కనిపిస్తే ఏ భయాలు, ఆందోళన అక్కర్లేదు. కలలో పాము కనిపించడాన్ని మంచి శకునమని చెబుతారు.  మీరు జీవితంలో విజయం సాధిస్తారని అర్థం. మీరు సురక్షితంగా ఉంటారని సైతం కొందరు పెద్దలు చెబుతారు.

Also Read: Face Mask Mistakes: ముఖానికి మాస్క్ ధరిస్తున్నారా, అయితే ఈ పొరపాట్లు మాత్రం చేయవద్దు

5. కుందేలు కనిపిస్తే..
మీకు గాఢ నిద్రలో ఉండగా కుందేలు లాంటి జంతువులు చాలా తక్కువ సందర్భాల్లో కలలో వస్తాయి. అయితే అలా కుందేలు కలలో కనిపించిన వ్యక్తుల ప్రేమ జీవితం బాగుంటుంది. వారు అధికంగా ప్రేమను పొందుతారు. కొన్ని రంగాలవారికి విజయం సిద్ధిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More