Home> ఆధ్యాత్మికం
Advertisement

Ganesh Utsav: డీజేలు లేవు.. మైక్‌లు బంద్‌.. గణేష్ ఉత్సవాలపై పోలీస్‌ శాఖ కఠిన ఆంక్షలు

Hyderabad Police Strict Instructions To Ganesh Mandap Associations: ఇక ఊరు వాడ గణేశ్‌ సంబరాలకు ముస్తాబవుతున్నాయి. కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలకు పోలీస్‌ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవి లేకుంటే...?

Ganesh Utsav: డీజేలు లేవు.. మైక్‌లు బంద్‌.. గణేష్ ఉత్సవాలపై పోలీస్‌ శాఖ కఠిన ఆంక్షలు

Hyderabad Police: హిందూవుల అతి పెద్ద ఉత్సవం వినాయక చవితి. నవరాత్రులు వినాయకుడికి పూజలు చేసి ఘనంగా నిమజ్జనం చేస్తారు. శ్రావణమాసం ముగుస్తుండడంతో భాద్రపదం మాసం అంటేనే వినాయక చవితి పండుగ. కొద్ది రోజుల్లో పండుగ రాబోతున్నది. ఇక ఊరు వాడ వినాయకులతో కళకళలాడనుంది. ఈ సందర్భంగా ప్రతి గల్లీలో వినాయక మండపం ఏర్పాటుకానుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం వినాయక చవితికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

ఉత్సవాల సమయంలో ఎలాంటి ఘర్షణలు, వివాదాలు, ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తగా కొన్ని తప్పనిసరి చేసింది. మండపం ఏర్పాటు చేసుకోవాలంటే కొన్ని తప్పనిసరిగా ఉండాల్సిన పత్రాలను పోలీస్‌ శాఖ వెల్లడించింది. నిర్వాహకులు మండపం ఏర్పాటుకు పాటించాల్సిన సూచనలు, జాగ్రత్తలు వివరిస్తూనే అనుమతి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు ప్రకటించారు.

Also Read: Nagarjuna: నేను ఎలాంటి ఆక్రమణ చేయలేదు: కుండబద్దలు కొట్టిన నాగార్జున

హైదరాబాద్‌లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా మండపం ఏర్పాటుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మండపం ఏర్పాటుకు దరఖాస్తుల తేదీని తెలిపింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు https://www.tspolice.gov.in వెబ్‌సైట్‌లో నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 87126 65785లో సంప్రదించాలని పోలీసులు సూచించారు. శాంతియుత వాతావరణంలో పండుగ చేసుకోవావాలని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. తమకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మండపం నిర్వాహకులకు పోలీస్‌ శాఖ చేస్తున్న కొన్ని సూచనలు.

Also Read: Shocking Incident: వీళ్లు స్కూల్‌ పిల్లలా? వీధిరౌడీలా.. బాలికపై పిడిగుద్దుల వర్షం

పోలీస్‌ శాఖ సూచనలు

  • గణేష్‌ మండపం వేసే వారు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి పొందాలి.
  • రెండు బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే వాడాలి. రాత్రి 10 గం నుంచి ఉదయం 6 గంటల వరకు స్పీకర్లు వినియోగించరాదు.
  • విద్యుత్‌ కనెక్షన్ కోసం డీడీ తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి లేకుండా విద్యుత్‌ తీసుకుని ప్రమాదాలకు దారితీయకుండా చర్యలు.
  • మండపాలతో రోడ్డును మూసివేయరాదు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించరాదు. కనీసం ద్విచక్ర వాహనం వెళ్లేందుకు దారి వదలాలి.
  • డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు.
  • రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మైక్‌లు ఆఫ్ చేయాలి.
  • సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలి.
  • అగ్నిప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More