Home> ఆధ్యాత్మికం
Advertisement

Goddess Lakshmi Matha Birth: లక్ష్మీ దేవి ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా ?

Goddess Lakshmi Matha Birth Story : రామాయణం, భాగవతం లాంటి పురాణాలను తిప్పేస్తే.. ప్రతీ దేవుడి, దేవత పుట్టుక వెనుక ఏదో ఒక చెప్పుకోదగిన చరిత్ర, ప్రాముఖ్యత ఉన్నాయని అర్థం అవుతోంది. అలాగే మనం అందరం ఎంతో ఇష్టపడి, అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీ దేవి పుట్టుక వెనుక కూడా ఒక కథ ప్రచారంలో ఉంది.

Goddess Lakshmi Matha Birth: లక్ష్మీ దేవి ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా ?

Goddess Lakshmi Matha Birth Story : రామాయణం, భాగవతం లాంటి పురాణాలను తిప్పేస్తే.. ప్రతీ దేవుడి, దేవత పుట్టుక వెనుక ఏదో ఒక చెప్పుకోదగిన చరిత్ర, ప్రాముఖ్యత ఉన్నాయని అర్థం అవుతోంది. అలాగే మనం అందరం ఎంతో ఇష్టపడి, అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీ దేవి పుట్టుక వెనుక కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. లక్ష్మీ దేవికి ఆ పేరు లక్ష్య అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. అష్ట ఐశ్వర్యాలకు, సిరి సంపదలకు, విజయానికి లక్ష్మీ దేవీ పెట్టింది పేరు. అందుకే అష్ట లక్ష్మి, ఐశ్వర్య లక్ష్మి, విజయ లక్ష్మి అని ఇలా ఒక్కో అంశానికి సంబంధించి ఒక్కో పేరు వేర్వేరుగానూ ఉన్నాయి. లక్ష్మీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు, సుఖశాంతులతో పాటు చేసే పనిలో విజయం వరిస్తుందని పురాణే ఇతిహాసాలు చెబుతున్నాయి.

అమ్మలగన్న అమ్మ దుర్గా దేవి కూతురు లక్ష్మీ దేవి. అందుకే దుర్గమ్మను అమ్మలగన్న అమ్మ అని కొలుస్తుంటారని ప్రతీతి. మహా విష్ణువుకి లక్ష్మీ దేవి సతీమణి. విష్ణువు ఏ జన్మలో ఏ అవతారం ఎత్తినా... ఆ అవతారంలో మరో వేషంలో మారుపేరుతో ఆయన వెన్నంటే ఉంటూ వచ్చిన లక్ష్మీ దేవి గురించి తెలుసుకోవాలంటే ముందుగా క్షీరసాగర మధనం గురించి, ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరిందనే విషయాలు తెలుసుకోవాలి.

ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఓ విలువైన, పవిత్ర హారాన్ని బహుమతిగా అందిస్తాడు. అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఇస్తాడు. ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేలమీదేసి తొక్కేస్తుంది ఆ ఐరావతం. అది తనకు ఎంతో అవమానంగా భావించిన దుర్వాస మహర్షి.. ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు. ఏ రాజ్య భోగాలైతే చూసి మిడిసిపడుతున్నావో అవి లేకుండాపోవుగాక అని ఇంద్రుడికి శాపం పెట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు.

దుర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి. రాజ్యంలో సుఖశాంతులు కరువై ప్రజలు అష్టకష్టాలపాలవడం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయం సాధిస్తారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని దేవేంద్రుడు దేవుళ్లందరినీ తీసుకుని విష్ణు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటాడు. రాక్షసుల అరాచకాలు చెప్పుుకుని పరిష్కారం సూచించాల్సిందిగా వేడుకుంటాడు.

దేవేంద్రుడి మొర ఆలకించిన విష్ణువు... సముద్రంలో క్షీరసాగర మధనం చేయాల్సిందిగా సూచిస్తాడు. దేవుళ్లు, రాక్షసులు చెరోవైపు చేరి చేసే క్షీరసాగర మధనంలోంచి వచ్చే అమృతం ఎవరు సేవిస్తే వారిని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు. విష్ణువు సూచన మేరకు దేవుళ్లు ఒకవైపు, రాక్షసులు మరోవైపు చేరి క్షీరసాగర మధనం చేపడతారు. ఈ క్షీరసాగర మధనం మరో యుద్ధాన్ని తలపించినట్టు పురాణాలు చెబుతున్నాయి. 

క్షీరసాగర మధనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలోంచి ఓ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీ దేవి ప్రత్యక్షమవుతుంది. ఆమె ఇంద్రుడివైపున్న దేవుళ్లను సమర్ధిస్తూ విష్ణువు చెంతకు చేరుతుందని, అలా క్షీరసాగర మధనంలోంచి జనించిన లక్ష్మీ దేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై పై చేయి సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడని పురాణాల్లోని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. పురాణాల ప్రకారం లక్ష్మీ దేవి పుట్టుకకు ఇది ఒక కారణంగా ఇతిహాసాలను అవపోసన పట్టిన పండితులు చెబుతుంటారు.

Read More