Home> ఆధ్యాత్మికం
Advertisement

Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 4, 2021 Rasi Phalalu, రెండు రాశులవారికి ధనలాభం

Today Rasi Phalalu in Telugu From: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 4న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 4, 2021 Rasi Phalalu, రెండు రాశులవారికి ధనలాభం

Horoscope Today 4 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 4న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు కొందరు మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నించవచ్చు. భాగస్వామ్యం విషయంలో విభేదాలు తలెత్తె అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులకు ఆశించిన ఫలితాలు చేతికి అందనున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని గ్రహిస్తారు. మీ ఆలోచనలను దృఢంగా ఓ పద్ధతిలో ఉంచి అమలు చేయాలి. భయాందోళనకు గురవుతారు.

Also Read: Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం 

వృషభ రాశి
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొన్ని విషయాలు మీ మానసిక ఆందోళనను పెంచుతాయి. మిమ్మల్ని మీరు కొత్త దారిలోకి మలుచుకునే సమయం ఇది. మిమ్మల్ని అవమానించిన వ్యక్తులను మీరంటే ఏంటో వారికి తెలిసేలా చేస్తారు. మీరు శాయశక్తులా శ్రమించి ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగులకు అంతా మేలు జరుగుతుంది.

మిథున రాశి
మీరు నిర్వహించడానికి చాలా కష్టంగా ఉండే పనులు, బాధ్యతలు మీకు అప్పగిస్తారు. మీ అభిరుచి హేతుబద్ధమైన నిర్ణయానికి వచ్చేలా చేస్తుంది. అనారోగ్య సమస్య బాధిస్తుంది. ప్రశాంతంగా ఆలోచించండి. పిల్లలు, చిన్నారుల పట్ల ప్రేమగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

కర్కాటక రాశి
మీరు మీలాగే ఉండటానికి యత్నిస్తారు. ఇతరులను మెప్పించడానికి మీరు మార్చుకోవలసిన అవసరం లేదు. మీ గురించి తెలుసుకున్న వారు మిమ్మల్ని ప్రేమిస్తారని తెలుసుకుంటారు. మానసిక ప్రశాంత కోసం ధ్యానం చేయండి. కొన్ని రకాల వ్యాయామాలను ప్రయత్నించండి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. నేడు మీ సన్నిహితులతో సరదాగా సమయం గడపనున్నారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు.

సింహ రాశి
ఈ రోజు మీ అభిప్రాయాలను గట్టిగా చెబుతారు. కొందరు విభేదించినా మీరు నమ్మిన విషయాన్ని బల్లగుద్దిమరీ చెప్పేందుకు వెనుకంజ వేయరు. మీ అభిప్రాయం తప్పు అని కొంతమంది ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నా మీరు స్పష్టమైన వైఖరి ప్రదర్శిస్తారు. కొన్ని పనుల కోసం రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించకపోతే గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్, నూతన ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి.

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

కన్య రాశి
ఈ రోజు కన్యారాశి వారు తమ కోసం మాట్లాడనున్నారు. మీరు కనిపించే ప్రతి ఒక్కరితో సంభాషిస్తారు. కానీ నేడు అందుకు భిన్నంగా మీ గురించి చెప్పిన విషయాలతో కొందరు మీవైపు ఆకర్షితులవుతారు. ఉద్యోగులు, వ్యాపార రంగాల వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. నేడు కన్యారాశి వారికి ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది.

తులా రాశి
మీరు గతం గురించి మరియు మీరు చేసిన తప్పిదాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. జీవితంలో ముందుకు సాగడానికి మీరు గతాన్ని మరిచి భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలి. మానసిక ఆందోళనను తగ్గించుకునేందుకు ధ్యానం చేస్తారు. మీకు విశ్రాంతి తీసుకోవడానికి  ఇది సహాయపడుతుంది. చాలాకాలం తరువాత బంధువులు, మిత్రులు కొందరు మిమ్మల్ని కలవనున్నారు. రుణ సమస్యలు తీరే మార్గాన్ని కనుగొంటారు.

వృశ్చిక రాశి
ఈ రోజు మీరు కొత్త అభిరుచిని ఎంచుకుంటారు. అయితే ఇది స్వల్పకాలిక కోరిక, లక్ష్యమని ఎట్టిపరిస్థితుల్లోనూ భావించవద్దు. అందులో మీరు కెరీర్ వారీగా ముందుకు వెళ్లవచ్చు. అయితే చేసే పనిని పూర్తిగా నేర్చుకోవాలని గ్రహించాలి. నేడు మీకు ఆకస్మిక ధననష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు పనిచేసే చోట కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 

ధనుస్సు రాశి
మీరు చాలా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతారు. అయితే కొందరు మీకు హాని చేసేందుకు యత్నిస్తుంటారు. అలాంటి వ్యక్తి ఈ రోజు మీ జీవితంలోకి వస్తారు. అధిక భావోద్వేగాలకు లోనవుతారు. దీని పర్యావసనాలు ఎలా ఉండనున్నాయో మీరు ఆలోచించరు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేయాలని కుటుంబసభ్యులతో చర్చిస్తారు.

మకర రాశి
మీరు చాలాకాలం నుంచి ప్రేమను కోరుకుంటున్నారు. కానీ మీరు కోరుకున్న వ్యక్తిని కలిసేందుకు దారులు మూసుకుపోతాయి. అనారోగ్య సమస్యలు తప్పవు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా పనులలో పురోగతిని చూస్తారు. మీ ఆవేశం సమస్యలకు, అనర్థాలకు దారితీస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు చేపట్టేందుకు ఇది తగిన సమయం కాదు.

Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజున ఇలాచేస్తే పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు

కుంభ రాశి
మీరు చేసే పని ఇక ముందుకుసాగదు అని భావించినట్లయితే మరో అడుగు ముందుకు పడుతుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం అవుతాయి. చేపట్టిన పనులను మధ్యలో ఆపడం మంచిది కాదు.

మీన రాశి
మీరు ఒకరికి చెప్పదలచుకున్నది ఏదైనా ఉంటే అందుకు నేడు మంచి రోజు. వారు మీ నిర్ణయాలు మరియు ఆలోచనలను అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కుటుంబసభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యాన్ని ఏ మాత్రం అశ్రద్ధ చేయవద్దు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు యత్నాలు ముమ్మరం చేస్తారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More