Home> ఆధ్యాత్మికం
Advertisement

Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 24, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Today Horoscope In Telugu 24 March 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 24న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. 

Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 24, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 24 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 24న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు మీ ఆహార్యానికి కొంచెం అదనపు సమయం కేటాయిస్తారు. మీరు చాలా ఆనందంగా సరదాగా గడపున్నారు. కానీ ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో రుణ యత్నాలు మొదలుపెడతారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు గోచరించడం లేదు.

Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా

వృషభ రాశి
మీరు ఈరోజు పరిపూర్ణతను సాధించేందుకు అవకాశం లభిస్తుంది. అనుకోని అతిథి మీ ఇంటికి రానున్నారు. మీ ఇంటి ఆకారం, నిర్మాణం గురించి ఆందోళన చెందుతున్నందున మీరు కొంచెం భయానికి లోనవుతారు. అంతా బాగుంది కనుక ఆందోళన అక్కర్లేదని నిర్ణయానికి వస్తారు. ఉద్యోగులకు కలిసొస్తుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆస్తి మీ చేతికి వస్తుంది.

మిథున రాశి
మీరు ఈ రోజు సానుకూల మరియు సంతోషకరమైన వ్యక్తిగా మెలుగుతారు. ఈరోజు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించకపోతే గొడవలు జరుగుతాయి.

కర్కాటక రాశి 
మీ లక్ష్యాలు ఏంటన్న దానిపై స్పష్టత కోసం యత్నిస్తారు. కానీ ముందుచూపు లేకపోవడంతో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. మీ సన్నిహితుల నుంచి సహాయం ఆశిస్తారు. అదే సమయంలో మీరు గందరగోళానికి దూరంగా ఉంటారు. బాల్యమిత్రులు కలుస్తారు. కొన్ని కొత్త విషయాలు తెలుసుకుని ప్రయోజనం పొందుతారు.

Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే

సింహ రాశి
మీరు చాలా కాలం నుంచి చూడని మరియు మాట్లాడని వ్యక్తులు ఈ రోజు మీకు ఎదురుపడతారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఖర్చులు పెరగడంతో రుణాల కోసం యత్నిస్తారు. మీ స్నేహితులలో ఒకరితో కొత్త వెంచర్‌ను ప్రారంభించాలనుకోవచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదు. ఆలయాలు సందర్శిస్తారు.

కన్య రాశి
ఈ రోజు ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొన్ని విషయాలు న్యాయంగా జరగకపోవడంతో  ఆందోళనకు గురవుతారు. మీ అభిప్రాయానికి కట్టుబడి ఉంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు ప్రమోషన్ సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. 

తులా రాశి
మీ మనసులో మాటను బయటపెట్టేందుకు ఆలోచిస్తారు. అయితే చుట్టుపక్కల వారి అభిప్రయాలను గౌరవించకపోతే వారు మీకు దూరమయ్యే అవకాశం ఉంది. కొన్ని సమస్యల పరిష్కారం కోసం సన్నిహితులను సంప్రదిస్తారు. పనులలో జాప్యం ఏర్పడుతుంది. స్నేహితులతో కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి.

వృశ్చిక రాశి
మీ చుట్టుపక్కల వ్యక్తులు ఈ రోజు వ్యాపారం చేయడంలో బిజీగా ఉంటారు. అయితే ఈరోజు మీ పని వాతావరణం నుండి బయటపడండి. చుట్టుపక్కల వారితో సరాదాగా గడుపుతారు. కుటుంబసభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. నేడు మీకు ఆస్తిలాభం గోచరిస్తుంది.

ధనుస్సు రాశి
చాలా రోజుల తరువాత కుటుంబసభ్యులకు సమయాన్ని కేటాయిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం తలెత్తుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు.  అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మకర రాశి
ఈ రోజు మీరు మీకన్నా ఎక్కువ పలుకుబడి, అధికారం ఉన్నవారితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మీరు అదృష్టవంతులు అని తెలిసి, వారు మీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేసే ఆలోచన కూడా చేయరు. మీ ప్రతిభను మరియు మీ నైపుణ్యాలను నమ్మండి, నిరాశ చెందకండి. మీకు వాహనయోగం గోచరిస్తుంది. దైవదర్శనాలు చేయాలని భావిస్తారు.

కుంభ రాశి
కొన్ని విషయాలు మీకు విసుగు తెప్పిస్తాయి. మీరు పనిలో, ఇంట్లో ఉన్నా, మరియు ఎక్కడికి వెళ్ళినా సరదాగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొస్తుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. చాలా రోజుల తరువాత కొందరు మిత్రులు మిమ్మల్ని కలుస్తారు.

మీన రాశి
మీరు బంధాన్ని ఏర్పరుచుకోవాలను వారితో కనెక్ట్ అవ్వడానికి చాలా మార్గాలున్నాయి, మీ మాటలతో ఇతరులను ప్రభావితం చేయగలరు. మీకు ఎలా అనిపిస్తుందో అందరికీ మీ అభిప్రాయాన్ని చెబుతారు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని కీలక పనులు వాయిదా పడతాయి. వ్యాపారులకు అంతగా కలిసిరాదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Read More