Home> ఆధ్యాత్మికం
Advertisement

Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 15, 2021 Rasi Phalalu, నేడు వారికి వాహనయోగం

Today Horoscope In Telugu 15 March 2021 Rasi Phalalu: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 15న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 15, 2021 Rasi Phalalu, నేడు వారికి వాహనయోగం

Horoscope Today 15 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 15న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈరోజు మీరు ఊహించని విషయాలు జరగనున్నాయి. మీలో గొప్ప మార్పు సంభవించే అవకాశం ఉంది. చేసే పనిలో శ్రద్ధ అవసరం. తద్వారా మీకు ప్రయోజనాలు కలగనున్నాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులకు సైతం ఏమాత్రం కలిసిరాదు. రుణాల కోసం యత్నిస్తారు.

Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా

వృషభ రాశి
ఈ రోజు మీరు ఇతరుల గొడవలో చిక్కుకోకున్నారు. ఇతరుల వ్యాపారానికి, విషయాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు యత్నించండి. వృత్తిపరమైన రంగంలో మీకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ కెరీర్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. నేడు చేయవలసిన పనుల నుండి మీ దృష్టిని మళ్ళించవద్దు. ఉద్యోగులు, వ్యాపారులకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి.

మిథున రాశి
సమయం మరియు వనరుల కొరత కారణంగా మీరు గతంలో వదిలేసిన పనిని ఎంచుకోనున్నారు. గతంలో మీరు ఈ పనిని ఎందుకు విడిచిపెట్టారో ఆ కారణాలను పట్టించుకోరు. మీ పనులలో ఆటంకాలు తొలగిపోనున్నాయి. కుటుంబసభ్యులు, సన్నిహితులతో సరదాగా గడుపుతారు.

కర్కాటక రాశి
ఈరోజు మీకు అంతా శుభమే జరగనుంది. కొన్ని లక్ష్యాలను మీరు చేరుకోవచ్చు. పనులలో ఎదురయ్యే ఆటంకాలకు కారణాలు కనుగొని పరిష్కరించుకుని ముందుకు సాగుతారు. మీ మాటల్ని చుట్టుపక్కల వారు జాగ్రత్తగా గమనిస్తున్నారని గ్రహిస్తారు. మనస్సును ఏకాగ్రతపై నిమగ్నం చేయడానికి తగిన సమయం. ఆర్థిక సమస్యలతో రుణాల కోసం యత్నాలు మొదలుపెడతారు. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. 

Also Read: పరమ శివుడికి ఏమేం సమర్పించాలి, వేటితో అభిషేకం చేయాలో తెలుసా

సింహ రాశి
ఈ రోజు మీ ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. అయినప్పటికీ మీ పనులు జరగకుండా ఏదో శక్తి మిమ్మల్ని అడ్డుకున్నట్లుగా అనిపిస్తుంది. అయితే గందరగోళ స్థితిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదు. పగటిపూట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యల కారణంగా పనులు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

కన్య రాశి
ఇతరుల పనిని మీరు తిరస్కరిస్తారు. అయితే మీరు చెప్పే కారణంగా మిమ్మల్ని ఎవరూ తప్పుపట్టరు. మీ నిజాయితీ కారణంగా గౌరవాన్ని పొందుతారు. నేడు మీకు వస్తులాభం గోచరిస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సన్నిహితుల సలహాలు పాటించి విజయం సాధిస్తారు. చాలాకాలం తరువాత కొందరు వ్యక్తులును మీరు కలుసుకుంటారు.

తులా రాశి
ఈ రోజు ఇతరులతో మాట్లాడటం మీకు చాలా అవసరం. మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోలేదని మీకు అనిపించవచ్చు. మీరు వారితో సమయం గడపని కారణంగా ఆ భావన మీలో కలుగుతుంది. మీ పరిస్థితి వారికి అర్థమయ్యేలా చెప్పడానికి యత్నించండి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన మేర ఫలితాలు రానున్నాయి. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. అనవసర విషయాలపై చింతించవద్దు.

Also Read: Health tips: పర కడుపున ఈ పదార్ధాలు అస్సలు తీసుకోకండి

వృశ్చిక రాశి
ఈ రోజు పనులతో తీరిక లేకుండా గడుపుతారు. దాని వల్ల మీరు విశ్రాంతి కోరుకుంటారు. అందుకు తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని మర్చిపోవద్దు. మార్పు కోరుకుంటే వేరే చోట పని వెతుక్కోవచ్చు. కొన్ని రిస్క్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న పనితో సంతృప్తి చెందకపోతే మార్పు జరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబసభ్యులు, సన్నిహితులతో విభేదాలు చికాకు తెప్పిస్తాయి.

ధనుస్సు రాశి
ఈరోజు శారీరకంగా మీరు ఉత్సాహంగా ఉంటారు, కానీ మానసిక శక్తి కోసం యోగా, ధ్యానం లాంటివి చేయాలి. రేపటి కార్యక్రమాల కోసం అంతా సిద్ధం చేసుకుంటారు. కానీ ఏమీ చేయకుండా సమయం మాత్రం వృథా చేయకూడదు. శ్రమ పెరిగినా ఫలితం అంతంత మాత్రమే. ఆర్థిక సమస్యల కారణంగా రుణ యత్నాలు ప్రారంభిస్తారు. 

మకర రాశి
కొందరు వ్యక్తులు మీ పనిని అడ్డుకునేందుయు తీవ్రంగా యత్నిస్తారు. మీ పట్టుదల, శ్రమ ముందు వారి ప్రయత్నాలు సఫలం కావు. ఉద్యోగంలో మార్పులు కోరుకుంటారు. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాలని భావిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే నిర్ణయాలకు కట్టుబడి పనిచేయడి అత్యంత కీలకం అని గ్రహించాలి.

కుంభ రాశి
మీరు కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలలో చేసే వాదనలు ముగుస్తాయి. భిన్నాభిప్రాయాలు సహజమేనని గొడవకు ముందే సమస్యను పరిష్కరించుకుంటారు. ఇతరుల అభిప్రయాలకు విలువ ఇవ్వడం ద్వారా వారికి మిత్రులు అవుతారు. అకారణంగా మాట పట్టింపు మిమ్మల్ని బాధిస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. అధికంగా శ్రమించినా ఫలితం అంతంత మాత్రమేనని నిరాశ చెందుతారు.

మీన రాశి
ఇతరుల సహాయం కోరడానికి అంతగా ఇష్టపడరు. కానీ ఈరోజు ఇతరుల సహాయం తీసుకుని కొన్ని పనులు పూర్తి చేయనున్నారు. ఆర్థిక సమస్యలు తీరనున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధువులు, మిత్రులతో సరదాగా సమయం గడుపుతారు. చేసే పనికి తగ్గ ఫలితాన్ని ఉద్యోగులు పొందనున్నారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More