Home> ఆధ్యాత్మికం
Advertisement

Horoscope: డిసెంబర్ 31 నుంచి ఈ రాశుల వారి జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి..ఎందుకో తెలుసా?


Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక గ్రహాలు ఈ నెల చివరిలో సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడి ఊహించని లాభాలతో పాటు నష్టాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Horoscope: డిసెంబర్ 31 నుంచి ఈ రాశుల వారి జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి..ఎందుకో తెలుసా?

Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహాన్ని సంపద సంతానం ఆనందం సంతోషం వివాహానికి కారణంగా పరిగణిస్తారు. అందుకే ఈ గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉంటే కోరుకున్న కోరికలతో పాటు అదృష్టం రెట్టింపు అవుతుంది. అయితే 2023 సంవత్సరంలోని చివరి నెలలో గురు గ్రహం సంచారం చేయబోతోంది. ఈ సంచారం శుభస్థానంలో జరిగే జాతకాల వారికి మంచి లాభాలు కలుగుతాయి. అయితే డిసెంబర్ 31వ తేదీన బృహస్పతి గ్రహం ఉదయం ఏడు గంటలకి ప్రత్యక్షంగా సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలతో పాటు నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రానికి చెబుతున్నారు. అయితే ఏయే రాశుల వారికి ఈ గురు గ్రహ సంచారం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి గురుగ్రహ సంచారం చాలా శుభప్రదంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశి వారికి బృహస్పతి పదవ స్థానంలో ఉండబోతున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఆనందం సంపదకు ఈ సమయంలో ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు ఆరోగ్య సమస్యల నుంచి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది.

సింహరాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం సంచారం చేసినప్పుడు సింహ రాశి వారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుంది. ఈ రాశి వారికి గురు గ్రహ సంచారం తొమ్మిదవ స్థానంలో జరగబోతోంది. దీని కారణంగా ఉద్యోగాలు చేసే వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా బాస్ ఇతర అధికారుల మద్దతు లభించి మంచి ఫలితాలు పొందుతారు. ఇక ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారు విదేశాలకు కూడా వెళ్ళవచ్చు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

ధనస్సు రాశి:
ఈ సంవత్సరం చివరిలో జరగబోయే గురు గ్రహ సంచారం ధనస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఉద్యోగాలు చేసే వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. గురుగ్రహం ఈ రాశి వారికి జాతకంలో ఐదో స్థానంలో సంచారం చేయబోతోంది. దీని కారణంగా వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు కలుగుతాయి. ఇక చిన్న చిన్న సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More