Home> ఆధ్యాత్మికం
Advertisement

Happy Maha Shivratri Wishes 2024: ఆ శివుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ.. మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..


Happy Maha Shivratri Wishes 2024 In Telugu: మహాశివరాత్రి భారతీయులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు. ఇలాంటి రోజున ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపాలని కోరుకుంటూ మీ ప్రియమైన వారికి శివనామ స్మరణతో ఈ శుభాకాంక్షలను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియాల ద్వారా పంపండి.

Happy Maha Shivratri Wishes 2024: ఆ శివుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ.. మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..

Happy Maha Shivratri Wishes 2024 In Telugu: భారతీయులు ఎంతో పవిత్రంగా జరుపుకునే మహాశివరాత్రి ఒకటి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజిస్తారు. అంతేకాకుండా ఈరోజు ఉపవాసాలు కూడా పాటించి జాగారాలను చేయడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ శివరాత్రి రోజు ఈశ్వరుడిని నిర్మూలమైన మనసుతో కొలిచేవారికి ఆయన అనుగ్రహం లభించి పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం. ఇలాంటి ఎంతో పవిత్రమైన రోజున తప్పకుండా మీ ప్రియమైన వారికి ఈ క్రింది ప్రత్యేకమైన శివనామ స్మరణ కలిగిన కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి. వారి జీవితంలో ఆ శివుడి అనుగ్రహం కలగాలని కోరుకోండి.

Happy Maha Shivratri Wishes:

1. హర హర మహదేవ! శివుని అనుగ్రహం మీ జీవితంలోని అన్ని కోరికలను నెరవేర్చాలని కోరుకుంటూ..శివరాత్రి శుభాకాంక్షలు.

2. ఈ పవిత్ర మహా శివరాత్రి సందర్భంగా, శివుని కరుణ మీ కుటుంబంపై చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ..మహా శివరాత్రి శుభాకాంక్షలు.

3. శివుని దివ్య కాంతి మీ జీవితంలో వెలుగుతో పాటు ఆనందంతో నింపాలని మనసారా కోరుకుంటూ, మహా శివరాత్రి శుభాకాంక్షలు.

4. ఓం నమః శివాయ! ఈ శివరాత్రి రోజున కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..శివరాత్రి శుభాకాంక్షలు.

5. శివుని శక్తి మీకు ధైర్యం, దృఢ నిశ్చయాన్నిచ్చి జీవితంలోని అన్ని సవాళ్లను అధిగమిస్తుంది..ఇలాంటి శక్తి అందరూ పొందాలని కోరుకుంటూ..మహా శివరాత్రి శుభాకాంక్షలు.

6. శివుని పవిత్ర పాదాలకు మనం శరణాగతి చేస్తూ పిల్లపాపలను సంతోషంగా ఉంచాలని కోరుకుందాం..

7. ఈ మహా శివరాత్రి వేళ  శివుని అనుగ్రహం పొంది, జీవితంలో సుఖ సంతోషాలను పొందాలని కోరుకుంటూ..శివరాత్రి శుభాకాంక్షలు.

8. ఓం త్రయంబకం యజామాహే సుగంధిం పుష్టివర్ధనమ్‌। ఉర్వారుకమివ బంధనాన్‌ మృత్యోర్ముక్షీయ మామృతాత్‌॥ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

9. ఎల్లవేళల శివుని మంత్రాలను జపించి ఆయన ఆశీస్సులను పొందాలని కోరుతూ మీకు, మీ కుటుంబ సభ్యులకు శివరాత్రి శుభాకాంక్షలు.

10. ఈ శివరాత్రి రోజు మీరు శివుని దివ్య భక్తిలో మునిగిపోయి, ఆయన అనుగ్రహం పొందాలని కోరుకుంటూ..మహా శివరాత్రి శుభాకాంక్షలు.

11. శివుని పేరును జపిస్తూ  ప్రశాంతమైన మనస్సు శాంతిని పొందాలని కోరుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు.

12. ఈ మహా శివరాత్రి, మీరు శివుని దివ్య ప్రేమలో మునిగిపోయి, ఆయన అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ..శివరాత్రి శుభాకాంక్షలు.

13. శివుని అనుగ్రహం వల్ల మీకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ..మహా శివరాత్రి శుభాకాంక్షలు!

14. హర హర మహదేవ! శివరాత్రి శుభాకాంక్షలు!

15. శివుని దివ్య ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More