Home> ఆధ్యాత్మికం
Advertisement

Happy Kanuma Wishes 2024: కనుమ పండగ శుభాకాంక్షలు,స్పెషల్ కోట్స్, వాట్సాప్ మెసేజెస్..

Happy Kanuma Wishes In Telugu 2024: ఈ సంవత్సరం కనుమ పండగ జనవరి 16వ తేదీన వచ్చింది. పురాణాల ప్రకారం ఈ కనుమ పండుగ రోజున పశువులను పూజించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా ఈరోజు రైతులంతా సంతోషంతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.

Happy Kanuma Wishes 2024: కనుమ పండగ శుభాకాంక్షలు,స్పెషల్ కోట్స్, వాట్సాప్ మెసేజెస్..

 

Happy Kanuma Wishes In Telugu 2024: సంక్రాంతి పండగల భాగమైన కనుమ పండగ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ పండగ పశువులు పాడి రైతులను సూచిస్తుంది. అందుకే కనుమ పండుగ రోజున రైతులంతా పశువులను పూజించడం ఓ ఆనవాయితీగా వస్తోంది ఈరోజు గ్రామాల్లో ఉండే రైతులందరూ పశువులను శుభ్రం చేసి వాటికి స్నానాలు చేయించి కొమ్ములకు రంగులను వేసి ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాకుండా వాటికి కమ్మనైన పిండి వంటలను పెడతారు. వ్యవసాయంలో భాగంగా రైతులకు తోడుగా ఉన్నందుకు ఈరోజు కృతజ్ఞతా భావంతో వాటిని పూజిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగను మనమందరం ప్రతి సంవత్సరం జరుపుకోవాలి. అంతేకాకుండా ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకోవాలి.

✾ ఈ కనుమ పండగ పర్వదినాన ప్రతి రైతు పండించిన పంటలో రెట్టింపు దిగుబడి రావాలని మనసారా కోరుకుంటూ కనుమ పండుగ శుభాకాంక్షలు. 

✾ కనుమ పండుగ మీ అందరి జీవితాల్లో మరపురాని జ్ఞాపకాలను సంతోషాన్ని తీసుకురావాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ కనుమ..

✾ ఈ కనుమ సందర్భంగా మీ అందరికీ అదృష్టం రెట్టింపు అవ్వాలని ఆ దేవుని కోరుకుంటూ కలకాలం సంతోషంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.

✾ ఈ కనుమ మీ అందరి కుటుంబాలకు సకల ఐశ్వర్యాలను తీసుకురావాలని ఆ శ్రీమహావిష్ణువుని ప్రార్థిస్తూ మీ అందరికీ హ్యాపీ కనుమ..

✾ కనుమ పండగ మీ మనసులోని చెడు ఆలోచనలను తొలగించి మంచి ఆలోచనలను నింపాలని మనసారా కోరుకుంటూ.. హ్యాపీ కనుమ.

✾ ఈ కనుమ పండగ పూట మీ జీవితంలో సరికొత్త వెలుగులు నిండాలని, ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ.. మీ అందరికీ కనుమ పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు.

✾ ఈ సంవత్సరం కనుమ మీ జీవితంలో కలలను నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

✾ ఈ కనుమ పండుగను ప్రతి సంవత్సరం మీ కుటుంబ సభ్యులకు కలిసి ఆనందంగా సంతోషంతో జరుపుకోవాలని ఆ దేవుని మనసారా ప్రార్ధిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు.

✾ రైతుల పండుగ కనుమ మీ జీవితంలోని కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను సిరిసంపదలను తీసుకురావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.

✾ ఈ కనుమ పండగ మీ అదృష్టాన్ని పెంచి ఎల్లప్పుడూ సిరి సంపదలను అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు.

✾ రైతుల కష్టానికి ఎప్పుడూ ప్రతిఫలం రావాలని.. రైతు జీవితంలో కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ.. ప్రతి రైతుకు కనుమ పండగ శుభాకాంక్షలు.

✾ వ్యవసాయానికి సాయం చేసే ప్రతి పశువు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలని.. రైతుకు ఎప్పుడు సహాయంగా ఉండాలని మనసారా కోరుకుంటూ.. హ్యాపీ కనుమ..

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More