Home> ఆధ్యాత్మికం
Advertisement

Guru Vakri 2023: రాబోయే 4 నెలలపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?

Guru Vkari 2023 Effect: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మారుస్తాయి. ఈ నెల ప్రారంభంలో బృహస్పతి గమనంలో పెను మార్పు వచ్చింది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 
 

Guru Vakri 2023: రాబోయే 4 నెలలపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?

Jupiter Retrograde 2023: అష్ట గ్రహాల్లో బృహస్పతి కూడా ఒకరు. దీనిని గ్రహాలన్నింటిలోకెల్లా అతి పెద్ద గ్రహంగా పిలుస్తారు. పురాణాలు ప్రకారం, బృహస్పతిని దేవతల గురువుగా పిలుస్తారు. రీసెంట్ గా గురు గ్రహం యెుక్క గమనంలో మార్పు వచ్చింది. ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. సాధారణంగా గ్రహాల రివర్స్ కదలిక ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఒక్కోసారి మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. గురుడు తిరోగమనంలో నాలుగు నెలలపాటు ఉండనున్నాడు. దీంతో మూడు రాశులవారికి శుభ ఘడియలు మెుదలుకానున్నాయి. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మకరరాశి
గురు వక్రీ కారణంగా మకరరాశి వారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా విలువైన వస్తువు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు స్థిర చరాస్తులు లభిస్తాయి. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు లగ్జరీ ఐటమ్స్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఊహించని లాభాలను ఇస్తుంది.
సింహరాశి
బృహస్పతి తిరోగమన సమయంలో సింహరాశి వారు శుభవార్తలు వింటారు. మీకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు పెళ్లి కూడా ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. మీ సంపద పెరుగుతుంది. లక్ మీ వెంటే ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. 
ధనుస్సు రాశి
గురు గ్రహం తిరోగమనం వల్ల ధనస్సు రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు భారీగా డబ్బును ఆదా చేస్తారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు.  మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. 

Also Read: Ganesh Chaturthi 2023: గణేష్‌ పూజలో భాగంగా తప్పకుండా ఈ నియమాలు పాటించాలి, నిమజ్జనం ప్రత్యేక సమయాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More