Home> ఆధ్యాత్మికం
Advertisement

Jupiter Planet: త్వరలో అరుదైన యోగం... ఈ రాశుల కోరిక నెరవేరడం ఖాయం..

Guru Margi 2022: జ్యోతిషశాస్త్రంలో దేవగురు బృహస్పతిని శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. మీ జాతకంలో గురుడు మంచి స్థానంలో ఉంటే మీకు కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. 
 

Jupiter Planet: త్వరలో అరుదైన యోగం... ఈ రాశుల కోరిక నెరవేరడం ఖాయం..

Guru Margi In November 2022: ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు మెుత్తం 12 రాశులవారి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయి. జ్యోతిష్యశాస్త్రంలో బృహస్పతిని శుభగ్రహంగా పరిగణిస్తారు. ప్రస్తుతం మీనరాశిలో తిరోగమనంలో గురుడు ఈనెల 24న మార్గంలోకి రానున్నాడు. మార్గి గురువు కారణంగా గజకేసరియోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఏ రాశివారికి మార్గి గురువు శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.  

వృశ్చికం (Scorpio): వృశ్చిక రాశి వారికి మార్గశిర గురువు వల్ల ఏర్పడిన గజకేసరి యోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో లాభం ఉంటుంది. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఇదే మంచి సమయం. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం  సాధిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 

తుల (Libra): మార్గశిర గురువు వల్ల ఏర్పడుతున్న గజకేసరి యోగం తులారాశి వారికి శుభం కలుగుతుంది. పెళ్లికాని యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం  లభిస్తుంది. వృత్తిలో లాభాలు ఉంటాయి. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది.

మేషం (Aries): గురు ప్రత్యక్ష సంచారం వల్ల ఏర్పడుతున్న గజకేసరి యోగం మేష రాశి వారికి మేలు చేస్తుంది. మీరు పొదుపు చేస్తారు. ఉద్యోగాలు చేసే వారికి కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది, దుబారా తగ్గుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. 

Also Read: Margashira Masam 2022: మార్గశీర మాసం వచ్చే పండగలు..ఉపవాసాలు ఆచరిస్తే కలిగే ప్రయోజనాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More