Home> ఆధ్యాత్మికం
Advertisement

Guru Margi 2022: దీపావళి తరువాత అరుదైన యోగం.. ఇక ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే...

Guru Margi 2022 Impact: ప్రస్తుతం బృహస్పతి మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. వచ్చే నెల 24న మార్గంలోకి రానున్నాడు. గురుడు ప్రత్యక్ష సంచారం వల్ల కొన్ని రాశులవారి ఆదాయం పెరగనుంది. 
 

Guru Margi 2022: దీపావళి తరువాత అరుదైన యోగం.. ఇక ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే...

Guru Margi In November 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన స్థానాన్ని మార్చుకుంటుంది. దీని ప్రభావం మొత్తం 12 రాశులవారి జీవితాలపై కనిపిస్తుంది. ప్రస్తుతం దేవగురువు బృహస్పతి మీనరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. నవంబరు 24న గురుడు ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు .  జూలై 29న బృహస్పతి మీనంలో తిరోగమనం చేశాడు. వచ్చే నెల 24 నుంచి కదలడం(Guru Margi 2022) ప్రారంభిస్తుంది. బృహస్పతి మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు పంచ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మేషం (Aries)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశి యెుక్క 9వ మరియు 12వ గృహాలకు బృహస్పతి అధిపతి. దీంతో గురు మార్గం ఈరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు మీకు కావాల్సిన చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారులు భారీ లాభాలు ఆర్జిస్తారు. 
మిథునరాశి (Gemini)- ఈ రాశి యెుక్క 8వ మరియు 11వ ఇళ్లకు అధిపతి బృహస్పతి. దీంతో ఈ రాశివారు అపారమైన ప్రయోజనాలను పొందుతారు. మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  

కర్కాటకం (Cancer)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహం యొక్క మార్గం ఈ రాశి వారి జీవితంలో సంతోషాన్ని తీసుకొస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. 
కన్య (Virgo)- బృహస్పతి ఈ రాశి యెుక్క నాల్గవ మరియు ఏడవ ఇళ్లకు అధిపతి. దీంతో ఈ రాశివారి ఆదాయం భారీగా పెరుగుతుంది. బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగులకు శాలరీ పెరుగుతుంది. అంతేకాకుండా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  

Also Read: Surya Gochar 2022: వృశ్చికరాశిలో సూర్య సంచారం... ఈ రాశులవారికి అపారమైన ప్రయోజనం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.         

Android Link - https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More