Home> ఆధ్యాత్మికం
Advertisement

Guru ki Mahadasha: 16 సంవత్సరాల పాటు గురు మహాదశ.. ఈ వ్యక్తులకు డబ్బే డబ్బు! రాజు లాంటి జీవితం

Guru Antardasha, Jupiter will gives problems in Antardasha time. ఒక వ్యక్తి యొక్క జాతకంలో బృహస్పతి శుభ స్థానంలో ఉంటే.. అతడు రారాజు అవుతాడు. 
 

Guru ki Mahadasha: 16 సంవత్సరాల పాటు గురు మహాదశ.. ఈ వ్యక్తులకు డబ్బే డబ్బు! రాజు లాంటి జీవితం

Guru Mahadasha and Antardasha Effects: ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో వివిధ గ్రహాల మహాదశ మరియు అంతర్దశ నడుస్తుంది. ఒక గ్రహం ఒక వ్యక్తి జాతకంలో శుభ లేదా బలమైన స్థానంలో ఉన్నప్పుడు.. మహాదశ సమయంలో ఆశించిన ఫలితాలను ఇస్తుంది. అదే సమయంలో వ్యక్తి జాతకంలో బలహీన స్థానంలో ఉన్నపుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవగురు బృహస్పతి చాలా శక్తివంతమైన గ్రహంగా జ్యోతిష్యశాస్రంలో పరిగణించబడతాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. బృహస్పతి ఏ రాశిలో ఉన్నా అతని మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో ఒక వ్యక్తి యొక్క జాతకంలో బృహస్పతి శుభ స్థానంలో ఉంటే.. అతడు రారాజు అవుతాడు. 

ప్రభావం: 
ఎప్పుడైతే బృహస్పతి యొక్క మహాదశ ప్రారంభం అవుతుందో స్థానికుల జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో ఆ వ్యక్తి చాలా డబ్బు పొందుతాడు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. ఈ సమయంలో ప్రతికూల ఆలోచనల నుంచి విముక్తి లభిస్తుంది. జీవితంలో సానుకూలత వస్తుంది. విద్యారంగంలో ఉన్నవారు ఈ కాలంలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందుతారు.

శుభ ప్రభావం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎవరి జాతకంలో బృహస్పతి శుభ స్థానంలో ఉంటుందో అలాంటి వ్యక్తులు ఆకర్షణీయంగా ఉంటారు. ఈ వ్యక్తులు ప్రశాంతంగా మరియు చాలా జ్ఞానం కలిగి ఉంటారు. ఉన్నత విద్యను పొందుతారు. కెరీర్‌లో చాలా లాభాలుంటాయి. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు. జీవితం సాఫీగా సాగిపోతుంది. 

అశుభ ప్రభావం:
ఓ వ్యక్తి జాతకంలో బృహస్పతి అశుభ స్థానంలో ఉంటే.. అలాంటి వారు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. కెరీర్‌లో చాలా కష్టాలు ఉంటాయి. పిల్లలతో ఆనందం ఉండదు. ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది.

నివారణలు:
దేవగురువు బృహస్పతి యొక్క బలహీనమైన లేదా అశుభ స్థితి ఉన్న వ్యక్తులు గురువారం ఉపవాసం ఉండాలి. ఈ రోజున పసుపు మిఠాయిలు లేదా శనగ పిండి మరియు పసుపుతో చేసిన ఏదైనా వస్తువును సేవించడం శ్రేయస్కరం. నీటిలో పసుపు వేసి స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించండి. గురువారం అరటి చెట్టుకు పూజ చేసి.. పసుపు, బెల్లం, శనగపప్పు సమర్పించాలి. గురువారం రోజు పప్పు, అరటి పండ్లు మరియు పసుపు మిఠాయిలను దానం చేయడం వల్ల కూడా గురువు స్థానం బలపడుతుంది.

Also Read: Hyundai Sonata Facelift Launch: హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. లుక్, ఫీచర్స్ అదుర్స్! లగ్జరీ కార్లకు ధీటుగా

Also Read: Upcoming Electric Cars: విడుదలకు సిద్ధంగా ఉన్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. పూర్తి వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Read More