Home> ఆధ్యాత్మికం
Advertisement

Guru Rahu yuti 2023: ఏప్రిల్ లో అశుభకరమైన యోగం చేయబోతున్న గురుడు-రాహువు.. ఈ 3 రాశులకు కష్టాలే కష్టాలు..

Guru Chandal Yog 2023: ఏప్రిల్ లో గురుడు, రాహువు కలిసి అశుభకరమైన యోగాన్ని చేయబోతున్నాయి. దీని వల్ల కొన్ని రాశులవారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 
 

Guru Rahu yuti 2023: ఏప్రిల్ లో అశుభకరమైన యోగం చేయబోతున్న గురుడు-రాహువు.. ఈ 3 రాశులకు కష్టాలే కష్టాలు..

Guru Chandal Yog 2023: రీసెంట్ గా చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రులు 9 రోజులు దుర్గామాత యెుక్క తొమ్మిది అవతారాలను పూజిస్తారు. చైత్ర నవరాత్రులు మార్చి 22న మెుదలయ్యాయి. అయితే సరిగ్గా నెల రోజుల తర్వాత అశుభకరమైన యోగం ఏర్పడుతుంది. అదే గురు చండాల యోగం. మేషరాశిలో గురుడు, రాహువు కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తునాయి. 

గురు చండాల యోగం లక్షణాలు
గురు చండాల యోగం ఏర్పడినప్పుడు మనిషిలో మంచి లక్షణాలు తగ్గి ప్రతికూల గుణాలు పెరుగుతాయి. ఈ యోగం వల్ల వ్యక్తి స్వభావంలో మార్పు వస్తుంది. అంతేకాకుండా అనేక వ్యాధులు చుట్టుముడతాయి. దాంపత్య జీవితం నరకంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో సమయం కలిసి రాదు. 

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి గురు చండాల యోగం అశుభకరం. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. మనసులో తెలియని భయం ఏర్పడుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
మిధునరాశి
గురు చండాల యోగ ప్రభావం మిధునరాశి వారిపై 6 నెలల పాటు ఉంటుంది. ఈ సమయంలో మీరు కొన్ని చెడు వార్తలు వినే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆఫీసులో కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. ఓపికతో పని చేయాల్సి ఉంటుంది.
మేషం
ఏప్రిల్ 22 తర్వాత ఇదే రాశిలో గురు చండాల యోగం ఏర్పడుతుంది. దీంతో మీరు రాబోయే ఆరు నెలలుపాటు జాగ్రత్తగా ఉండాలి. మీ పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. నిరాశ నిస్ప్రహులు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆరోగ్యం దెబ్బ తింటుంది. 

Also Read: Navpancham Yog 2023: 30 ఏళ్ల తర్వాత 'ట్రిపుల్ నవపంచం యోగం'... ఈ 3 రాశులపై డబ్బు వర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More