Home> ఆధ్యాత్మికం
Advertisement

ShaniDev: ఈ 3 రాశుల వారిని శనిదేవుడు ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు, అందులో మీరు ఉన్నారేమో చూసుకోండి..

ShaniDev Favourite Zodiacs: శనిదేవుడు ప్రతి ఒక్కరికి వారి కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. శని అనుగ్రహం ఉంటే సాడే సతి, ధైయాలో కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. 
 

ShaniDev: ఈ 3 రాశుల వారిని శనిదేవుడు ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు, అందులో మీరు ఉన్నారేమో చూసుకోండి..

ShaniDev Favourite Zodiacs: ప్రతి మనిషి మంచి చెడుల ఆధారంగా ఫలాలను ఇచ్చే వాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని (ShaniDev) న్యాయదేవుడు, కర్మదాత అని కూడా పిలుస్తారు. ఎవరిపై శని మహాదశ ఉంటుందో వారు తీవ్ర ఇబ్బందులు పడతారని మనకు తెలుసు. అయితే ఒక్కోసారి శనిదేవుడు శనిసాడే సతి, ధైయాలో కూడా శుభఫలితాలను ఇస్తాడు. 

ఈరాశులకు శని అధిపతి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మకరం మరియు కుంభరాశికి అధిపతి శని దేవుడే. ప్రస్తుతం శని మకరరాశిలో ఉన్నాడు. తిరోగమన శని శుభఫలితాలను ఇవ్వదని చాలా మంది నమ్ముతారు. కావున మకర, కుంభ రాశుల వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.

ఈ రాశులను శని ఇబ్బంది పెట్టడు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుస్సు, మీన రాశుల వారిని శనిదేవుడు పెద్దగా ఇబ్బంది పెట్టడు. ఈ రాశుల వారు మంచి పనులు చేసినంత కాలం శని దేవుడు వారికి శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ రాశులవారు శని నియమాలను పాటిస్తే... వారికి శని దేవుడి అనుగ్రహాం లభిస్తుంది. దాంతో వారికి ఎల్లప్పుడూ దేనికీ లోటు ఉండదు.  

శనికి ఇష్టమైన రాశి ఇదే..
ఆస్ట్రాలజీలో శని దేవుడికి అత్యంత ప్రియమైన రాశిచక్రం తులారాశి అని చెబుతారు. తుల రాశి వారు ఇతరులకు మంచి చేస్తే.. అది వారి కెరీర్ లో పురోగతికి తోడ్పడుతుంది. ఈ రాశి వారు అందరూ మెచ్చుకునే పనులు చేస్తే..శని వారికి ఊహించని ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా వీరు లైఫ్ లో ఉన్నత స్థాయికి వెళతారు.  

Also Read: Shani Vakri 2022: తిరోగమనంలో శనిదేవుడు.. ఈ 3 రాశులవారికి దశ తిరుగుడు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More