Home> ఆధ్యాత్మికం
Advertisement

Sun's Transit in Scorpio 2023: సూర్య గ్రహ సంచారంతో ఈ రాశుల వారికి మరో ఛాన్స్..ఈ గోల్డెన్ డేస్ అసలు మిస్ చేసుకోవద్దు..

Sun's Transit in Scorpio 2023: సూర్య గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ డిసెంబర్లో జరగబోయే సూర్య గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Sun's Transit in Scorpio 2023: సూర్య గ్రహ సంచారంతో ఈ రాశుల వారికి మరో ఛాన్స్..ఈ గోల్డెన్ డేస్ అసలు మిస్ చేసుకోవద్దు..

Sun's Transit in Scorpio 2023: గ్రహాలన్నిటికీ రాజుగా వ్యవహరించే సూర్యుడు త్వరలోనే  రాశి సంచారం చేయబోతున్నాడు. ఏ రాశిలో నాయన సూర్యగ్రహం దాదాపు 30 రోజులపాటు సంచార దిశలో కొనసాగుతుంది. అయితే డిసెంబర్ నెలలో సూర్యుడు రాశి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం డిసెంబర్ 16వ తేదీన ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతోంది. సూర్య గ్రహ సంచారం మధ్యాహ్నం 3 గంటల నుంచి వృశ్చిక రాశి నుంచి కదలడం ప్రారంభించి ధనస్సు రాశిలోకి సంచారం చెయ్యబోతోంది. ఈ గ్రహ సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సూర్య గ్రహ సంచారం కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ధనుస్సు రాశి:
సూర్య గ్రహ సంచారం కారణంగా ధనస్సు రాశి వారికి డిసెంబర్ నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశి వారికి సూర్యుడు అనుగ్రహంతో సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కష్టపడి పనులు చేస్తున్న వారికి విజయం వెన్నంటే ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన మీ జీవిత భాగస్వామి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా వీరు కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్పులకు వెళ్లే ఛాన్సులు కూడా ఉన్నాయి.

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి

మిథున రాశి :
సూర్యుడి సంచారం కారణంగా మిథున రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఎదురైన సమస్యలన్నీ ఈ సమయంలో సులభంగా పరిష్కారం అవుతాయి. ధన లాభం కోసం ప్రణాళికలు చేస్తున్న వారికి ఇది గొప్ప అవకాశంగా భావించవచ్చు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో పర్యాటక ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన గొప్ప విజయాలు పొందడం ఖాయం. అంతేకాకుండా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి శృంగారానికి సంబంధించిన కోరికలు కూడా నెరవేరుతాయి.

మీన రాశి:
సూర్యుడి సంచారం కారణంగా మీన రాశి వారి జీవితాల్లో మళ్లీ గోల్డెన్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో అదృష్టం పెరిగి ఊహించని లాభాలు పొందడం ఖాయం. అంతేకాకుండా వివాహితులకు శృంగార కోరికలు కూడా నెరవేరుతాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి మేనేజర్ సపోర్ట్ లభించి మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Read More