Home> ఆధ్యాత్మికం
Advertisement

Gajakesari Yoga: నవంబర్ 5న గజకేసరి యోగం.. ఈ రాశులకు అదృష్టం..!

Gajakesari Yoga: రేపు అంటే శనివారం నాడు గజకేసరి యోగం ఏర్పడుతోంది. పైగా ఇదే రోజు ప్రదోష వ్రతం కూడా. ఈరోజున శనిదేవుడిని పూజిస్తే రెట్టింపు ఫలితాలను పొందుతారు. 
 

Gajakesari Yoga: నవంబర్ 5న గజకేసరి యోగం.. ఈ రాశులకు అదృష్టం..!

Gajakesari Yoga: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శనిదేవుడు గత నెల 23న మకరరాశిలో సంచరించాడు. ఇది కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. శని ప్రదోష వ్రతం ఈ శనివారం వస్తుంది. అదే సమయంలో శనిదేవుడు గజకేసరి యోగాన్ని (Gajakesari Yoga) ఏర్పరుస్తున్నాడు. ఈరోజున శనిని ఆరాధిస్తే.. ఆ దేవుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. 

శనివారం నాడు చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. బృహస్పతి ఇప్పటికే మీనరాశిలో ఉన్నాడు. దీంతో ఈ శనివారం మీనరాశిలో గజకేసరి యోగం ఏర్పడుతోంది. ప్రదోష గజకేసరి యోగంలో ఈసారి శని వ్రతం పడుతోంది. ఈ సమయంలో చేసే పూజ అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కుంభం మరియు మీన రాశికి అధిపతి శనిదేవుడు. ఈ రెండు రాశులవారు శనిదేవుడిని పూజించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. వీరికి ఆర్థికాభివృద్ధితోపాటు ధనలాభం కూడా ఉంటుంది. అలాగే, వృత్తి మరియు వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.  

శని దేవుడిని ఈ విధంగా పూజించండి
శనివారం తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. అనంతరం శని దేవాలయానికి వెళ్లి పూజలు చేయండి. తర్వాత శనిచాలీసా పఠించండి. సాయంత్రం వేళ శని ఆలయంలో ఆవాల నూనె వెలిగించి నల్ల నువ్వులను దానం చేయండి. శనివారం సుందరకాండను పారాయణం చేయడం ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది. శనివారం డబ్బు గురించి ప్రగల్భాలు పలకకండి. ఎవరినీ అవమానించవద్దు మరియు ఎవరికీ హాని చేయవద్దు. వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయండి.

Also Read: Astro Tips: ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ పద్ధతులు పాటించాల్సిందే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More