Home> ఆధ్యాత్మికం
Advertisement

April Festival Calendar 2023: ఏప్రిల్ నెలలో రానున్న పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?

Festivals in April 2023: హిందూ మతంలో పండుగలకు చాలా ప్రాధాన్యత ఉంది. వచ్చే నెలలో కొన్ని ముఖ్యమైన వ్రతాలు, పండుగలు రానున్నాయి. ఏప్రిల్ లో వచ్చే ఫెస్టివల్స్ , ఉపవాసాలు ఏంటో తెలుసుకుందాం. 
 

April Festival Calendar 2023:  ఏప్రిల్ నెలలో రానున్న పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?

April Festival Calendar 2023: రేపటి నుండి ఏప్రిల్ నెల ప్రారంభం కానుంది. ఈ నెలలో కొన్ని ప్రధానమైన వ్రతాలు మరియు పండుగలు రానున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసం ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుంది. తర్వాత నుంచి వైశాఖ మాసం ప్రారంభం కానుంది. వచ్చే నెలలో  హనుమాన్ జన్మోత్సవ్, కామద ఏకాదశి, వరుథిని ఏకాదశి, అక్షయ తృతీయ, పరశురామ జయంతి మరియు సీతా నవమి వంటి అనేక ప్రధాన పండుగలు రానున్నాయి. ఏప్రిల్ నెలలో వచ్చే ఫెస్టివల్స్ గురించి తెలుసుకోండి. 

ఏప్రిల్ నెల పండుగలు/వ్రతాల లిస్ట్:
ఏప్రిల్ 1, శనివారం - కామద ఏకాదశి వ్రతం
ఏప్రిల్ 2, ఆదివారం - మదన ద్వాదశి
ఏప్రిల్ 3, సోమవారం - ప్రదోష వ్రతం
ఏప్రిల్ 4, మంగళవారం - మహావీర్ జయంతి
ఏప్రిల్ 5, బుధవారం - రేణుకా చతుర్దశి
ఏప్రిల్ 6, గురువారం - స్నాన్ దాన్ పూర్ణిమ / హనుమాన్ జన్మోత్సవం
ఏప్రిల్ 9, ఆదివారం - గణేష్ చతుర్థి వ్రతం

ఏప్రిల్ 16, ఆదివారం - వరుథిని ఏకాదశి
ఏప్రిల్ 17, సోమవారం - ప్రదోష వ్రతం
ఏప్రిల్ 18, మంగళవారం - శివ చతుర్దశి ఉపవాసం
ఏప్రిల్ 19, బుధవారం - శ్రాద్ధ అమావాస్య
ఏప్రిల్ 20, గురువారం - స్నాన దానం అమావాస్య
22 ఏప్రిల్, శనివారం - అక్షయ తృతీయ
ఏప్రిల్ 23, ఆదివారం - వినాయక చతుర్థి ఉపవాసం
ఏప్రిల్ 25, మంగళవారం - సూరదాస్ జయంతి / ఆదిశంకరాచార్య జయంతి
ఏప్రిల్ 27, గురువారం - గంగా సప్తమి
ఏప్రిల్ 29, శనివారం - సీతా నవమి

ఏప్రిల్ 14తో ముగియనున్న కర్మలు
హిందూ మతంలో కర్మలకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు కర్మలను పరిగణిస్తారు. ఈ  మాసంలో సూర్యుడు మీనరాశిలో ఉంటాడు, దీని వల్ల ఎటువంటి శుభ కార్యాలు జరగవు. ఇదే కాకుండా, జ్యోతిషశాస్త్రంలో 4 అబుజ్ ముహూర్తాలు పేర్కొనబడ్డాయి, వాటిలో అక్షయ తృతీయ కూడా ఒకటి. ఈ పండుగ ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు.

Also Read: Shukra Gochar 2023: వృషభరాశిలో శుక్రుడి గోచారం.. వచ్చే నెల రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More