Home> ఆధ్యాత్మికం
Advertisement

Ketu And Venus Conjunction: ఆగస్టు 25న కేతు, శుక్ర గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..

Ketu And Venus Conjunction In Telugu: ఆగస్టు 25వ తేదీన కన్యా రాశిలో శుక్రుడు కేతు గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే అన్ని పనుల్లో ఉన్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

Ketu And Venus Conjunction: ఆగస్టు 25న కేతు, శుక్ర గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..

Ketu And Venus Conjunction In Telugu: గ్రహాలు తమ అనుకూలతను బట్టి రాశులను మారు తూ ఉంటాయి. దీని ఫలితంగా నే ప్రత్యేకమైన ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. జాతకంలో గ్రహస్థానాలే జీవితంలోని అన్ని పరిస్థితులపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా శుక్ర గ్రహం ఒక రాశి మరో రాశి సంచారం చేసినప్పుడు ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. ఈ గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో సంపాదన ప్రేమ తెలివితేటలకు సూచికగా భావిస్తారు భావిస్తారు. ఇదిలా ఉంటే ఈ శుక్ర గ్రహం త్వరలోనే తన రాశిని మార్చుకోబోతోంది.

ఆగస్టు 25వ తేదీన సింహ రాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశించబోతోంది. అంతు చిక్కని గ్రహంగా పిలవబడే కేతు గ్రహం కూడా గత సంవత్సరం నుంచి కన్యా రాశిలో సంచార దశలో ఉన్నాడు. అయితే ఈ శుక్ర గ్రహం కూడా ఆ రాశిలోకి సంచారం చేయడం కారణంగా రెండు గ్రహాల కలయిక జరగబోతోంది. ఈ రెండు గ్రహాల కలయిక దాదాపు 9 నెలల తర్వాత జరుగుతోంది కాబట్టి ఎంతో ప్రత్యేకమైన యోగం ఏర్పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.

కన్యారాశిలో కేతువు శుభగ్రహాలు కలయిక కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా మారుతుంది. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు జాతకంలో శుభ స్థానంలో ఉన్న రాశుల వారికి డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభించి.. వీలైనంత త్వరలోనే ధనవంతులు అవుతారు. అంతేకాకుండా వ్యాపారాలు చేస్తున్నవారు ఈ సమయంలో విపరీతమైన ధనాన్ని పొందుతారు వైవాహిక జీవితం కూడా ఎంతో బాగుంటుంది. 

ధనస్సు రాశి: 
శుక్రుడు కేతువు గ్రహాల కలయిక ధనస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అనేక లాభాలు కలుగుతాయి. అలాగే ప్రేమ సంబంధిత సమస్యల నుంచి కూడా విముక్తి లభించి భాగస్వామి పట్ల మంచిగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్నవారు ఈ సమయంలో పెట్టుబడులు కూడా పెడతారు. దీని కారణంగా ఊహించని ధన లాభాలు పొందుతారు. అలాగే గతంలో ఇచ్చిన అప్పులు కూడా ఈ సమయంలో తిరిగి వస్తాయి. 

మకర రాశి: 
ఈ రెండు గ్రహాల కలయిక మకర రాశి వారికి కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో పనులు చేస్తున్న వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు గుడ్ న్యూస్ వినే ఛాన్స్ కూడా ఉంది. అలాగే గతంలో ఉన్న వ్యాధుల నుంచి ఈ సమయంలో విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో చాలా శుభ్రంగా ఉండబోతోంది. అలాగే వీరు కొత్త బాధ్యతలను కూడా పొందుతారు. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో ప్రమోషన్స్ కూడా పొందుతారు.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More