Home> ఆధ్యాత్మికం
Advertisement

Mars Transit 2023: ఈ రాశులవారికి నవంబర్ 16 వరకు అంగారక గ్రహం ఎఫక్ట్‌..జరగబోయేది ఇదే..


Mars Transit 2023: అంగారక గ్రహం సంచారం చేయడం వల్ల ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ రాశులవారికి ధైర్యం, శక్తి కూడా పెరుగుతుంది. 

 Mars Transit 2023: ఈ రాశులవారికి నవంబర్ 16 వరకు అంగారక గ్రహం ఎఫక్ట్‌..జరగబోయేది ఇదే..

Mars Transit 2023: అంగారక గ్రహాన్ని  ధైర్యం, శక్తి, భూమి మొదలైన వాటికి కారకంగా సూచిస్తారు. ఈ గ్రహం సంచారం చేసినప్పుడల్లా మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది. అయితే అంగారకుడు 3 అక్టోబర్ 2023న తులారాశిలోకి సంచారం చేసింది. ఈ గ్రహం నవంబర్ 16 వరకు అదే రాశిలో సంచార క్రమంలో ఉంటుంది. తులారాశిలో ఈ గ్రహం సంచార క్రమంలో ఉండడం వల్ల 3 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

సింహ రాశి వారికి నవంబర్ 16 వరకు చాలా శుభ ప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా సింహ రాశి వారు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అన్ని పనులు చేయడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గొప్ప గొప్ప అవకాశాలను కూడా పొందుతారు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

తులారాశి వారికి అంగారక గ్రహం భవిష్యత్‌ మార్పులను సూచిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి ఊహించని ప్రయోజాలు కలుగుతాయి. ఈ సంచారం కారణంగా ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు. పోలీసు,  క్రీడలు మొదలైన రంగాలకు సంబంధించినవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది.

ధనుస్సు రాశి వారికి అంగారకుడి సంచార సమయం చాలా బాగుటుంది. ఈ సమయంలో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. భవిష్యత్‌ జీవితం కోసం మంచి ప్రణాలికలు సిద్ధం చేసుకుంటారు. దీంతో పాటు ఆర్థిక స్థితి కూడా బలంగా మారుతుంది. వ్యాపారాలు చేసేవారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం

Read More