Home> ఆధ్యాత్మికం
Advertisement

Malavya Raja Yogam: మాలవ్య రాజయోగంతో విపరీతమైన లాభాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..


Malavya Raja Yogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అద్భుతమైన లాభాలు పొందే రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకోండి.

Malavya Raja Yogam: మాలవ్య రాజయోగంతో విపరీతమైన లాభాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..

 

Malavya Raja Yogam In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశించడం వల్ల శుభ అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా సంచారం చేసిన గ్రహం వ్యక్తుల జాతకాల్లో శుభస్థానంలో ఉంటే అద్భుతమైన లాభాలు కలగడమే కాకుండా ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాలు సంచారం చేయడం కారణంగా ఎప్పుడు ప్రత్యేకమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో వ్యాపారాలపరంగా మార్పులు వస్తాయి. ఇదిలా ఉంటే బుధ గ్రహాన్ని వ్యాపారాలకు, తెలివితేటలకు, ప్రసంగాలకు సూచికగా పరిగణిస్తారు.  అయితే ఈ గ్రహం జూన్ 29వ తేదీ వరకు మిథున రాశి లోనే ఉండబోతోంది దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ బుధ గ్రహం మిథున రాశిలో ఇతర గ్రహాలతో కలయిక చేయడం కారణంగా అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం పరంగా జూన్ 29వ తేదీ వరకు బుధుడి సంచారంతో ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకోండి.

అంతేకాకుండా జూన్ 15వ తేదీన మిథున రాశిలోకి అన్ని గ్రహాలకు అధిపతిగా వ్యవహరించే సూర్యుడు కూడా ప్రవేశించాడు. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. దీంతో పాటు భద్ర, లక్ష్మీనారాయణ యోగాలు కూడా ఏర్పడ్డాయి. అలాగే మిధున రాశిలో అనేక గ్రహాలు ఉండడం కారణంగా ఇతర యోగాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో మిథున రాశిలో అన్ని గ్రహాలు ఒకే రేఖ మీదికి వస్తాయి. దీనివల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతుందని వారంటున్నారు. ఈ యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. దీంతోపాటు సంపద కూడా పెరుగుతుంది.

మేష రాశి: 
మాలవ్య రాజయోగం ఏర్పడడం కారణంగా మేషరాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ యోగ ప్రభావంతో ఈ రాశి వారు అనేక శుభవార్తలను వింటారు. అలాగే ఆర్థిక లాభాలు కూడా మెండుగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. సొంత వ్యాపారాలు ఉన్నవారికి ఈ సమయం చాలా వరకు కలిసి వస్తుంది. దీంతో పాటు ఉద్యోగాలు చేసే వారికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి.

మిధున రాశి: 
ఇప్పటి వరకే మిధున రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి. అయితే ఈ మాలవ్య రాజయోగం ఏర్పడడం కారణంగా మరిన్ని లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ సులభంగా నెరవేరుతాయి. అలాగే సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా పేరు ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. దీంతో పాటు పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు కూడా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. దీంతోపాటు అదృష్టం రెట్టింపు అయ్యి ఉద్యోగాలు చేసే వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

సింహరాశి: 
సింహరాశి వారికి కూడా మాలవ్య రాజయోగం కారణంగా విపరీతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కెరీర్ కు సంబంధించిన విషయాల్లో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు వీరికి జీవితంలో భౌతిక సౌఖ్యం కూడా లభిస్తుంది. అలాగే ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు కూడా ఎంతో సులభంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే వీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More