Home> ఆధ్యాత్మికం
Advertisement

Dreams Astrology: ఆ కలలకు శని దేవుడితో సంబంధం.. అలా వస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి..

Dreams Astrology: మీకు శని దేవుడికి సంబంధించిన కలలు వస్తున్నాయంటే.. మీ జీవితంలో ఏవో మార్పులు జరగబోతున్నాయని అర్థం. శని దేవుడు మీ పట్ల దయ చూపడం లేదా మీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఆ కలలు సంకేతం.

Dreams Astrology: ఆ కలలకు శని దేవుడితో సంబంధం.. అలా వస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి..

Dreams Astrology: కలలు జీవితంపై చాలా ప్రభావం చూపుతాయి. అవి మన మనస్సును మాత్రమే కాకుండా, మన భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తాయి. వాటి ప్రభావంతో కలిగే శుభ, అశుభ సంకేతాలను స్వప్న గ్రంథంలో వివరంగా చెప్పడం జరిగింది. కొన్ని కలలకు శని దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఆ కలలు ఏమిటో.. శని దేవుడి ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

శని దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉండే కలలు : 

మీకు శని దేవుడికి సంబంధించిన కలలు వస్తున్నాయంటే.. మీ జీవితంలో ఏవో మార్పులు జరగబోతున్నాయని అర్థం. శని దేవుడు మీ పట్ల దయ చూపడం లేదా మీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఆ కలలు సంకేతం.

1) కలలో శని దేవుడి విగ్రహం లేదా చిత్రం కనిపిస్తే.. రాబోయే కాలం మీకు సుఖ సంతోషాలను తీసుకొస్తుంది. అదే సమయంలో మీ జాతకంలో శని స్థానాన్ని బట్టి దాని ఫలితాలు ఉంటాయి. కొంతమందికి శని దేవుడి విగ్రహం కలలోకి వస్తే లేని ఇబ్బందులు ఎదురవొచ్చు. 

2) మీ కలలో శని దేవుడే నేరుగా వచ్చి అనుగ్రహించినట్లయితే.. ఆ కల చాలా శుభప్రదం. శని దేవుడు మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తాడని అర్థం. అనారోగ్య సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఇతరత్రా సమస్యలతో బాధపడేవారికి శని దేవుడు కలలో కనిపిస్తే.. వారి సమస్యలన్నీ తొలగిపోతాయి.

3) కలలో శని దేవాలయం కనిపిస్తే శుభప్రదమని చెబుతారు. ఆ వ్యక్తులు శనిదేవుని అనుగ్రహాన్ని పొందబోతున్నారని అర్థం. శని దేవాలయం కలలో కనిపించడం ధన లాభానికి సంకేతం. అలాగే కొన్ని కీలక పనుల్లో విజయం సాధిస్తారని సంకేతం. 

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: IND vs AUS: మెగ్ లానింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సెమీస్‌కు ఆసీస్! ఇక టీమిండియాకు చావోరేవో!!

Capgemini Recruitment: క్యాప్ జెమినిలో డిగ్రీ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్... పూర్తి వివరాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More