Home> ఆధ్యాత్మికం
Advertisement

Dreams Meanings: మీ కలలో అవి కన్పిస్తున్నాయా..అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్టే

Dreams Meanings: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కలలకు విభిన్న అర్ధాలుంటాయి. భవిష్యత్‌లో జరిగే వివిధ ఘటనలకు సంకేతాలే కలలు. మీకు కూడా కలలో అటువంటివి కన్పిస్తుంటే..ఇక ఎగిరి గంతేయవచ్చు. లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతాలంట..
 

Dreams Meanings: మీ కలలో అవి కన్పిస్తున్నాయా..అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్టే

Dreams Meanings: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కలలకు విభిన్న అర్ధాలుంటాయి. భవిష్యత్‌లో జరిగే వివిధ ఘటనలకు సంకేతాలే కలలు. మీకు కూడా కలలో అటువంటివి కన్పిస్తుంటే..ఇక ఎగిరి గంతేయవచ్చు. లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతాలంట..

నిద్రలో వచ్చే కలలకు జ్యోతిష్యశాస్త్రం, సైన్స్ వివిధ రకాలుగా అర్ధాలు చెబుతుంటుంది. మనిషి మానసిక పరిస్థితి అద్దం పట్టేవి కలలని సైన్స్ చెబుతుంటే..కలలకు వేరే అర్ధాలుంటాయని జ్యోతిష్యం లేదా వివిధ మతాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో జరిగే వివిధ ఘటనలకు సంకేతాలే కలలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అందుకే కలల్ని బట్టి రోజంతా ఆందోళన చెందుతుంటారు చాలామంది. కొన్ని రకాల కలలు ఆ వ్యక్తి జీవితంలో మహాలక్ష్మీ దేవి ప్రవేశిస్తుందనేందుకు సంకేతాలని అంటారు. ఆ కలలేంటో చూద్దాం..

మీకు వచ్చే కలల్లో..చిన్న పిల్లలు నవ్వడం లేదా బుడి బుడి అడుగులతో నడవడం కన్పిస్తే శుభ సూచకమని అర్ధం. ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని అర్ధమంటారు జ్యోతిష్య పండితులు. పళ్లు విరగడం కూడా శుభసూచకమేనట. ఆ వ్యక్తి కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకుంటాడని అర్ధం. ఇక మరోవైపు బట్టలు కుడుతూ లేదా కుట్టిస్తూ కలలో కన్పిస్తే..అంతులేని ధన సంపద ఇంటికొస్తుందని అర్ధం. ఉద్యోగాల కోసం అణ్వేషించడం, ఏదైనా వస్తువు లాక్కోవడం లేదా లాక్కుని పారిపోవడం కూడా శుభసూచకమేనంటోంది జ్యోతిష్యశాస్త్రం. పెద్దఎత్తున డబ్బు లభిస్తుందని అర్ధం. 

కలలో ఎత్తైన స్థలంపై ఎక్కడం లేదా  ఆలయానికి వెళ్లడం శుభ సంకేతంగా చెబుతారు. మీరు ఊహించని విజయం లభిస్తుందని అర్ధం. తెల్ల పాము కాటేయడం కూడా ఆర్ధికంగా లాభం చేకూరుతుందని అర్ధం. 

Also read Sravana Shivratri 2022: శ్రావణ శివరాత్రి వచ్చేస్తోంది... తేదీ, పూజ ముహూర్తం తెలుసుకోండి

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More