Home> ఆధ్యాత్మికం
Advertisement

Nightmare: మీకు కలలో ఇవి కనిపిస్తే.. మీరు త్వరలోనే ధనవంతులవుతారని అర్థం...

Dream Interpretation: మనకు వచ్చే కలలను బట్టి భవిష్యత్తును తెలుసుకోవచ్చు. ఇవి మీకు కలలో కనిపించినట్లయితే మీరు మంచి ఫలితాలు పొందుతారు. 
 

Nightmare: మీకు కలలో ఇవి కనిపిస్తే.. మీరు త్వరలోనే ధనవంతులవుతారని అర్థం...

Dream Interpretation: మనం నిద్రలో రోజూ కలలు కంటూ ఉంటాం. ఇందులో కొన్ని మంచివి ఉంటే, మరికొన్ని చెడువి ఉంటాయి. అయితే మనకు వచ్చే డ్రీమ్స్ (Dream Interpretation)ను బట్టి ఫ్యూచర్ ను చెప్పవచ్చని స్వప్నశాస్త్రం చెబుతోంది. అయితే ఇవీ మీకు కలలో కనిపించినట్లయితే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 

కలలో నెమలిని చూడటం..
డ్రీమ్ లో నెమలిని చూడటం శుభ సంకేతంగా భావిస్తారు. ఎందుకంటే నెమలి శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి మీరు త్వరలోనే దైవిక ఆశీర్వాదం పొందుతారు. ఆగిపోయిన మీ పని పూర్తవుతుంది.  

కలలో కాకిని చూడటం..
కలలో కాకిని చూడటం వల్ల మీరు త్వరలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు. అయితే మీరు డ్రీమ్ లో తూర్పు నుండి పడమరకు కాకి ఎగురుతున్నట్లు చూసినట్లయితే.. త్వరలో మీకు డబ్బు రాబోతున్నట్లు అర్థం. అంతేకాకుండా విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. 

కలలో హంస కనిపిస్తే...
మీకు కలలో హంస కనిపిస్తే అది శుభసూచకంగా భావించాలి. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. అంతేకాకుండా మీకు మంచి జరగబోతుంది. 

కలలో దేవుడిని చూడడం అంటే..
మీకు కలలో దేవుడి విగ్రహం కనిపిస్తే దానిని శుభ సంకేతంగా భావిస్తారు. మీ జీవితానికి సంబంధించిన కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. 

కలలో అంత్యక్రియల ఊరేగింపు చూడటం..
డ్రీమ్ సైన్స్ ప్రకారం, నిద్రలో అంత్యక్రియల ఊరేగింపు చూడటం అశుభంగా భావిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో కనిపించే మృతదేహాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. 

కలలో అడవి కనిపించడం...
కలలో అడవిని చూడటం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా అడవి పచ్చగా ఉంటే అది భవిష్యత్తులో మీకు విజయాన్ని మరియు ఆర్థిక లాభాలను ఇస్తుంది.  కానీ ఎండిన చెట్లతో నిండిన అడవి మన జీవితంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలను సూచిస్తుంది.

Also Read: Guru Margi 2022: మీనంలో నడవనున్న గురుడు.. ఈ 5 రాశులవారిని వరించిన అదృష్టం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More