Home> ఆధ్యాత్మికం
Advertisement

Mahashivaratri 2024: అప్పులు తీరాలంటే మహాశివరాత్రి రోజు ఈ ఒక్క పనిచేయండి చాలు..

Mahashivaratri 2024 Debt Relief Remedy: హిందూమతంలో శివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ. దేశవ్యాప్తంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరో నమ్మకం ప్రకారం ఈరోజు పాలసముద్రం నుంచి హాలాహలం బయటకు వస్తే లోకకల్యాణం కోసం శివుడి ఆ విషాన్ని సేవిస్తాడు.

Mahashivaratri 2024: అప్పులు తీరాలంటే మహాశివరాత్రి రోజు ఈ ఒక్క పనిచేయండి చాలు..

Mahashivaratri 2024 Debt Relief Remedy: హిందూమతంలో శివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ. దేశవ్యాప్తంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరో నమ్మకం ప్రకారం ఈరోజు పాలసముద్రం నుంచి హాలాహలం బయటకు వస్తే లోకకల్యాణం కోసం శివుడి ఆ విషాన్ని సేవిస్తాడు.ఆరోజు నుంచి గుర్తుగా మహాశివరాత్రిని వేడుకగా జరుపుకొంటారు. శివుడికి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి ఫాల్గున మాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్ధశి తిథి రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 8 శుక్రవారం రోజు మహాశివరాత్రి రానుంది. ఈరోజు శివునికి పాలాభిషేకం చేయాలి. శివుడికి ప్రదోషకాలంలో చేసే పూజ అత్యంత విశిష్టమైంది. ఆ తర్వాత శివపురాణం పఠించాలి. అంతేకాదు శివుడికి ఇష్టమైన పూలను కూడా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం జాతకంలో తగ్గిపోతుంది.అయితే, శివపూజలో కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు. లేదంటే పరమేశ్వరునికి పట్టరాని కోపం వస్తుంది. ఆ వస్తువులు ఏంటో ఎందుకో తెలుసుకుందాం.

ఇదీ చదవండి: మహాశివరాత్రి నాడు త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులకు శివుడి అనుగ్రహం..

ఈ ఏడాది మార్చి 8 శుక్రవారం రోజు మహాశివరాత్రి రానుంది. ఈరోజు శివునికి పాలాభిషేకం చేయాలి. శివుడికి ప్రదోషకాలంలో చేసే పూజ అత్యంత విశిష్టమైంది. ఆ తర్వాత శివపురాణం పఠించాలి. అంతేకాదు శివుడికి ఇష్టమైన పూలను కూడా సమర్పించాలి. ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చేయడం వల్ల మనస్సు ఆహారానికి నీటికి దూరంగా ఉంటారు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈరోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుంటారు. పూజగదిలో దీపం పెట్టి శివయ్యను పూజిస్తారు. అంతేకాదు దగ్గర్లో ఉన్న శైవాలయాలకు వెళ్లి జలాభిషేకం చేసి పంచామృతాన్ని శివయ్యకు సమర్పిస్తారు. పంచామృతంలో పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి ఉంటుంది. ఈ ఐదింటిని కలిపి అభిషేకం చేస్తారు. 

ఇదీ చదవండి: మహాశివరాత్రి శుభాకాంక్షలు, ప్రత్యేకమైన కోట్స్, వాట్సాప్ స్టేటస్ పిక్స్..
కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా రుణ ముక్తి పొందలేరు. ఆర్థిక ఇబ్బందులు వారిని వెంటాడుతూనే ఉంటాయి. ఈ సందర్భంలో మహాశివరాత్రి శివారాధన చేస్తే రుణ విముక్తి పొందుతారు. శివపురాణంలో రుణవిముక్తి గురించిన పరిహారం ఉంది. మీ ఇంటి దగ్గర్లో ఏదైనా శివాలయంలో నువ్వుల నూనె దీపాన్ని వెలింగించండి ఇలా చేస్తే ఆ శివుడి కృప మీ ఉంటుంది. అంతేకాదు మహాశివరాత్రిరోజు చెరుకు రసంతో శివయ్యకు అభిషేకం చేయాలి. కుదిరితే పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయండి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు  ఓం నమఃశివాయః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్ల పఠించాలి. అప్పులు తీరాలంటే ఓం రుణ ముక్తేశ్వర మహాదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More