Home> ఆధ్యాత్మికం
Advertisement

Diwali 2023: దీపావళి పండగ రోజే ప్రత్యేక యోగాలు..10 రాశులవారు ఈ వస్తువులను దానం చేస్తే లాభాలే లాభాలు!

Diwali 2023: దీపావళి పండగ హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సంవత్సరం రాబోతున్న దీవాళి పండగ సందర్భంగా కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అన్ని రాశులవారు కొన్ని వస్తువులను దానం చేయడం చాలా మంచిది.

Diwali 2023: దీపావళి పండగ రోజే ప్రత్యేక యోగాలు..10 రాశులవారు ఈ వస్తువులను దానం చేస్తే లాభాలే లాభాలు!

 

Diwali 2023: ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని అమావాస్య రోజున దీపావళి పండగను జరుపుకుంటారు. ఈ పండగను భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ దీపావళి పండగ దాదాపు 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సంవత్సరం దీపావళి పండగ నవంబర్ 10న ధన త్రయోదశితో మొదలుకొని..నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది వచ్చిన దీవాళి పండగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాహువు, శని గ్రహాల స్థానాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక యోగాల శుభప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశులవారు దాన కార్యక్రమాలు చేయడం వల్ల ఊహించని ప్రయోజనాలు పొందుతారు. దీపావళి పండగ రోజున ఏయే రాశులవారు ఏయే వస్తువులను దానం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
మేష రాశి వారు దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పంచదార దానం చేయడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. ఈ రాశివారు దీవాళి రోజు ఎరుపు రంగు దుస్తువులను ధరించడం చాలా మంచిది.

వృషభ రాశి:
వృషభ రాశి వారు దీవాళి రోజున ప్రత్యేక పూజలు చేసి ఆహార వస్తువులు దానం చేయడం వల్ల గ్రహాల చెడు ప్రభావం తొలగిపోతుంది. అంతేకాకుండా దాన కార్యక్రమాలు చేసే క్రమంలో తెల్లని దుస్తులు ధరించడం వల్ల మరిన్ని లాభాలు పొందుతారు. 

మిథున రాశి:
మిథున రాశివారికి దీపావళి రోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో బెల్లాన్ని దానం చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. వీరు పూజలో భాగంగా క్రీమ్‌ కలర్స్‌ కలిగిన దుస్తువులను ధరించాలి.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు లక్ష్మీ పూజ తర్వాత అన్నం దానం చేయడం వల్ల జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఈ పూజలో భాగంగా మణి రంగుతో కూడిన దుస్తువులను ధరించాల్సి ఉంటుంది. 

సింహరాశి:
ఈ రాశివారికి దీపావళి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వీరు వస్త్రదానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీరు పండగ రోజు తెలుపు రంగు దుస్తువులను ధరించాల్సి ఉంటుంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

కన్య రాశి:
కన్యా రాశి వారు కూడా లక్ష్మీ పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు తీపి ఆహార పదార్థాలను దానంగా ఇచ్చి వీలైనంతా దక్షిణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పూజలో భాగంగా బూడిద రంగు దుస్తులు ధరించాలి.

తులా రాశి:
తుల రాశి వారు దీపావళి రోజు పుస్తకాలను దానం చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి గులాబీ రంగు దుస్తులు ధరించాల్సి ఉంటుంది. 

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు దీపావళి రోజున పప్పు, బెల్లం దానం చేయడం మంచిది. ఈ సమయంలో వీరు మెరూన్ కలర్ దుస్తులను ధరించడం చాలా శుభప్రదం.

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు ఇనుముతో తయారు చేసిన వస్తువులను దానం చేయాల్సి ఉంటుంది. వీరు ఈ సమంలో గోధుమ రంగు దుస్తులు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది.

మకరరాశి:
మకర రాశి వారు దీపావళి శుభ సందర్భంగా లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి..కొత్తిమీరను దానం చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బ్రాహ్మణులకు భోజనం చేయడం మంచిది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More