Home> ఆధ్యాత్మికం
Advertisement

Dhanteras 2023: ధనత్రయోదశి రోజు నుంచి ఈ రాశులవారికి మంచి రోజులు ప్రారంభం..

Dhanteras 2023 Horoscope Prediction: ధనత్రయోదశి పండుగ సందర్భంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారు ఆర్థికంగా కూడా ప్రయోజనాలు పొందుతారు. 

Dhanteras 2023: ధనత్రయోదశి రోజు నుంచి ఈ రాశులవారికి మంచి రోజులు ప్రారంభం..

 

Dhanteras 2023 Horoscope Prediction: ధనత్రయోదశి పండుగను ప్రతి సంవత్సరం దీపావళికి ముందు జరుపుకుంటారు. ఈ సంవత్సరం నవంబర్ 10, శుక్రవారం రోజున రాబోతోంది. ఈ రోజు కుబేరుడితో పాటు లక్ష్మిదేవిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. ఈ సంవత్సరం ధనత్రయోదశి పండుగ రోజున శుభ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా పండగ ప్రాముఖ్యత మరింత పెరిగింది. దాదాపు 400 ఏళ్ల తర్వాత  ధనత్రయోదశి పుష్య నక్షత్రం, శని పుష్య యోగంలో వచ్చింది. అయితే ఈ సంవత్సరం కూడా ఇదే సమయాల్లో వస్తోంది. పుష్య నక్షత్రం ఉదయం 07:57 నుంచి  10:29 వరకు ఉంటుంది. శని పుష్య యోగం ఉదయం 07:57 నుంచి రాత్రి వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయాల్లో కొన్ని రాశులవారికి చాలా ప్రయోజనాలు పొందబోతున్నారు. ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

వృషభ రాశి:
ఈ ప్రత్యేక యోగాల కారణంగా ధనత్రయోదశి రోజున వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశివారికి లక్ష్మీదేవి, కుబేరుడి అనుగ్రహం లభించి ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా పెరుగుతుంది. 

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ధనత్రయోదశి పండుగ చాలా శుభప్రదం కాబోతోంది. ఈ ప్రత్యేక యోగం ఏర్పడడం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టేవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

కన్యారాశి:
కన్యారాశి రాశి వారికి లక్ష్మీదేవి, కుబేరుడు అనుగ్రహం కారణంగా ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో ప్రమోషన్స్‌ కూడా లభించే ఛాన్స్‌లు ఉన్నాయి. వ్యాపారాలు, వృత్తి జీవితాల్లో కొనసాగుతున్నవారికి ఆదాయం రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

మకర రాశి:
మకర రాశివారు ధనత్రయోదశి పండుగ రోజు శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తంది. దీంతో పాటు జీవితంలో ఎప్పుడు పొందలేనంత సంతోషాన్ని కూడా పొందుతారు. లక్ష్మిదేవి అనుగ్రం లభించి ఊహించని లాభాలు కూడా సులభంగా పొందుతారు. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More