Home> ఆధ్యాత్మికం
Advertisement

Gajkesari Rajyog: ఏప్రిల్ లో ఏర్పడబోతున్న గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు తిరుగులేనంత ధనం

Gajkesari Rajyog: త్వరలో బృహస్పతి మరియు చంద్రుని కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీరే ఇప్పుడు తెలుసుకోండి..
 

Gajkesari Rajyog: ఏప్రిల్ లో ఏర్పడబోతున్న గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు తిరుగులేనంత ధనం

Guru Chandra Yuti 2023: మీనరాశిలో బృహస్పతి మరియు చంద్రుని కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ రాజయోగం మార్చి 22న ఏర్పడుతుంది. అలాగే ఈ రోజు నుండే చైత్ర నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ రాజయోగం అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మూడు రాశులవారు అపారమైన ధనం మరియు లాభాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.

మేష రాశిచక్రం:

మేష రాశి వారికి గజకేసరి రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి 12వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. విదేశీ వ్యాపారం చేసేవారు ప్రయోజనం పొందుతారు.  పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపారులు ఆకస్మిక ధనలాభం పొందుతారు. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.

వృషభ రాశి:

గజకేసరి రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీకు పాతపెట్టుబడుల నుండి లాభం పొందుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ఊహించనంత ధనాన్ని పొందుతారు. 

మిథున రాశి:

గజకేసరి రాజయోగం ఏర్పడటంతో మిథునరాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఈ యోగం మీ రాశితో కర్మ భావంలో ఏర్పడబోతోంది. దీంతో మీరు పని మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలలో గౌరవాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Also Read: Grahana Yogam 2023: మేషరాశిలో గ్రహణ యోగం.. మార్చి 23 నుండి ఈ 4 రాశులకు కష్టాలు షురూ..! 

Also Read: Rashmika Mandanna Sister : చూస్తుండగానే పెద్దది అయిపోతోంది.. రష్మిక ఎమోషనల్ కామెంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Read More