Home> ఆధ్యాత్మికం
Advertisement

Moon transit 2023: ఇవాల్టి నుంచి ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీ రాశి ఉందా?

Moon transit 2023: ఇవాళ చంద్రుడు, కుజుడు కలయిక వల్ల అరుదైన యోగం ఏర్పడుతుంది. కన్యారాశిలో ఏర్పడిన ఈ యోగం ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 
 

Moon transit 2023: ఇవాల్టి నుంచి ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీ రాశి ఉందా?

Benefits of Chandra Mangal Yogam:  ఆస్ట్రాలజీలో చంద్రుడికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇతడిని మనసుకి కారకుడిగా భావిస్తారు. చంద్రుడి ఇతర గ్రహాలతో కలవడం వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. సెప్టెంబర్ 15 ఉదయం 11:36 గంటలకు చంద్రుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. కన్యారాశిలో చంద్రుడు, అంగారకుడు గ్రహాల కలయిక వల్ల విశేషమైన యోగం ఏర్పడుతుంది. చంద్ర మంగళ యోగం వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందబోతున్నారు. 

కర్కాటక రాశి
చంద్ర మంగళ యోగం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీరు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. వృత్తి,ఉద్యోగ మరియు వ్యాపారాల్లో లాభం పొందుతారు. 
మేషరాశి
చంద్రుడి మరియు కుజుడి కలయిక మేషరాశి వారికి మంచి చేస్తుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీరు కోర్టు కేసులు గెలుస్తారు. ఫ్యామిలీ సపోర్టుతో సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.
మిధునరాశి
అంగారకుడు మరియు చంద్రుడు యోగం మిథునరాశి వారికి మేలు చేస్తుంది. స్థిర చరాస్తులు కలిసి వస్తాయి. వెహికల్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీరు ఫ్యామిలీతో కలిసి టూర్ కు వెళ్లవచ్చు. మీరు ఏ పని చేపట్టినా అది విజయవంతంగా పూర్తి అవుతుంది.  

Also Read: Shukra Gochar 2023: అక్టోబర్ 2 నుంచి ఈ రాశులవారి అదృష్టం రెట్టింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More