Home> ఆధ్యాత్మికం
Advertisement

Chandra Grahan 2023: చంద్ర గ్రహణం రోజునే బుద్ధ పూర్ణిమ.. దీని యెుక్క ప్రాముఖ్యత తెలుసుకోండి

Chandra Grahan 2023: గౌతమ బుద్ధుని జన్మదిన సందర్భంగా బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు. ఇదే రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. దీని యెుక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. 
 

Chandra Grahan 2023: చంద్ర గ్రహణం రోజునే బుద్ధ పూర్ణిమ.. దీని యెుక్క ప్రాముఖ్యత తెలుసుకోండి

Chandra Grahan 2023: ఈ బుద్ధ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఇదే రోజున గ్రహాలు, రాశుల కలయిక విచిత్రంగా ఉండబోతుంది. మే 05న వైశాఖ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం మే 5వ తేదీ రాత్రి 8.45 గంటల నుంచి మే 5, 6వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు ఉంటుంది. అంతేకాకుండా బుద్ధ పూర్ణిమ రోజున కూడా భద్ర నీడ కూడా ఉండబోతుంది. వైశాఖ పూర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమ రోజున ఉదయం 05.38 నుండి 11.27 వరకు భద్ర నీడ ఉంటుంది. బుద్ధ పూర్ణిమ (Buddha Purnima 2023) యెుక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. 

బుద్ధ పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారు?
జనన మరణాలకు అతీతంగా నిలిచిన గౌతమ బుద్ధుని గౌరవార్థం బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. ఇతడు శాక్య వంశంలో జన్మించాడు. ఇతడు పుట్టిన వెంటనే గొప్ప పాలకుడు లేదా సన్యాసి అవుతాడని జ్యోతిష్కులు చెప్పారు. అతడు ఇంటి నుంచి బయటకు వచ్చి వృద్ధుడిని, రోగిని, శవాన్ని మరియు సన్యాసిని చూశాడు. గౌతముడు 29 ఏట ఇంటి నుండి బయటకు వెళ్లి బోధి వృక్షం కింద మోక్షం పొందాడు. గౌతమ బుద్ధుడు ఒక ప్రదేశం నుండి మరోక ప్రదేశానికి సంచరిస్తూ మోక్ష మార్గాన్ని చూపాడు. 80 ఏళ్ల వయస్సులో బుద్ధుడు తనువు చాలించాడు. బుద్ధుడు జన్మదినం సందర్భంగా బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. 

Also Read: Shani Vakri 2023: రివర్స్ లో ప్రయాణించబోతున్న శని గ్రహం.. వచ్చే 139 రోజులు ఈ రాశులకు బాధాకరం..

Also Read: Surya Grahan 2023: ఇవాళ ఏర్పడబోయే సూర్యగ్రహణం ఈ రాశులకు మంచిది కాదు.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More