Home> ఆధ్యాత్మికం
Advertisement

Budhraditya Yog: కన్యారాశిలో బుధాదిత్య యోగం.. రాబోయే 18 రోజులు ఈ రాశులకు ప్రత్యేకం..

Budh Gochar In Kanya:  బుధ గ్రహం గత నెలలో కన్యారాశిలో సంచరించింది. ఇప్పటికే ఆ రాశిలో సూర్యుడు ఉండటం వల్ల ఈ రెండు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరిచాయి. ఈ యోగం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. 
 

Budhraditya Yog: కన్యారాశిలో బుధాదిత్య యోగం.. రాబోయే 18 రోజులు ఈ రాశులకు ప్రత్యేకం..

Budh Gochar In Kanya Rashi 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహ కదలికల ప్రభావం ప్రతి ఒక్కరిపై కనిపిస్తుంది. గత నెలలో మెర్క్యురీ గ్రహం కన్యారాశిలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఇది తిరోగమనంలో ఉంది. ఇప్పటికే అదే రాశిలో సూర్యుడు, శుక్రుడు ఉన్నారు. కన్యారాశిలో సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని (Budhraditya Yog) ఏర్పరిచారు. ఎవరి జాతకంలో అయితే బుధుడు శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అదృష్టవంతుడనే చెప్పాలి. గ్రహాల యువరాజైన బుధుడు రేపు మార్గంలోకి రానున్నాడు. అక్టోబరు 18 వరకు కన్యారాశిలో ఉంటాడు. ఈ రాశిలో మెర్క్యూరీ సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ముఖ్యంగా మేష, మిధున, కన్యా, ధనుస్సు రాశుల వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. 

మేషరాశి (Aries)- కన్యారాశిలోకి బుధుడు ప్రవేశించడం మేషరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. అదృష్టం కలిసి వచ్చి మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.  అక్టోబర్ 18 వరకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీరు ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
మిథున రాశి (Gemini)-
మేష రాశి వారితో పాటు మిథునరాశి వారికి కూడా ఈ సమయం చాలా ప్రత్యేకం. వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జిస్తారు. మీ ప్యూచర్ బాగుంటుంది. ఏదైనా బిజినెస్ చేయాలని భావిస్తే ఇదే మంచి సమయం. కొత్త వారితో పరిచయం మీకు లాభిస్తుంది. 
కన్య (Virgo)- బుధాదిత్య యోగం ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త పని చేయాలనే అనుకుంటే ఇదే మంచి సమయం. లక్ కలిసి వస్తుంది. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. 

Also Read: Budh Margi 2022: రేపటి నుండి మార్గంలోకి బుధుడు. ఈ 4 రాశులవారికి అంతులేని ఐశ్వర్యం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.        

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More