Home> ఆధ్యాత్మికం
Advertisement

Budha Sancharam 2022: రాశిని మార్చబోతున్న బుధుడు.. ఆగస్టు 1 నుండి మారబోతున్న ఈ రాశుల ఫేట్!

Mercury Transit 2022: బుధ గ్రహం రాశిచక్రాన్ని మార్చబోతోంది. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. ఈ సంచారం కొన్ని రాశులవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

Budha Sancharam 2022: రాశిని మార్చబోతున్న బుధుడు.. ఆగస్టు 1 నుండి మారబోతున్న ఈ రాశుల ఫేట్!

Mercury Transit 2022 Effect: ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మార్చుకుంటుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. ఇది కొన్ని రాశులకు శుభప్రదంగానూ, కొన్నింటిగాను అశుభంగానూ ఉంటుంది. బుధుడు...మేధస్సు, తర్కం, సంభాషణ, తెలివి, వాణిజ్యం మరియు స్నేహానికి కారకుడు. బుధుడు మరో నాలుగు రోజుల్లో తన రాశిని మార్చబోతున్నాడు. జూలై 31న మెర్క్యూరీ సింహరాశిలో (Mercury Transit in Leo 2022) సంచరించబోతున్నాడు. దీంతో ఆగస్టు 1 నుండి ఈ రాశుల భవిష్యత్తు మారనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషరాశి (Aries): మెర్క్యురీ సంచారం మేష రాశి వారు జీవితంలో ఆనందాన్ని తెస్తుంది.  వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయడానికి ఇది అనుకూల సమయం. వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. 

సింహరాశి (Leo): బుధుడి సంచారం..ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది.  దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. మీ వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. 

కన్య (Virgo): బుధుడు రాశి మారడం వల్ల కన్యా రాశి జీవితంలో పెను మార్పు రాబోతుంది. వీరు అనేక రంగాలలో విజయాలు సాధిస్తారు. ఈ రాశివారు వ్యాపారాన్ని విస్తరిస్తారు. అంతేకాకుండా భారీగా డబ్బు సంపాదిస్తారు.  

ధనుస్సు(Sagittarius): మెర్క్యూరీ మార్పు ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది. ఈ రాశివారు పెళ్లికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆదాయం పెరుగుతుంది.  

కుంభ రాశి (Aquarius): బుధ సంచార ప్రభావం కుంభరాశికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. సమాజంలో వీరికి గౌరవం పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది.  

Also Read: Mercury planet: జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే...భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా? 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More