Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Gochar 2023: రేపటి నుండి ఈరాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

Budh Gochar 2023 dates: బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. రేపు అంటే ఫిబ్రవరి 27న బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి రానుంది. 
 

Budh Gochar 2023: రేపటి నుండి ఈరాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

Budh Gochar 2023 dates: డబ్బు, వ్యాపారం, తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ కు కారకుడిగా బుధుడిని భావిస్తారు. బుధుడు రాశిలో మార్పు ప్రజల కెరీర్, ఆర్థిక స్థితి మరియు మాటతీరుపై ప్రభావం చూపుతుంది. ఫిబ్రవరి 27న బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే సూర్యభగవానుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు మరియు సూర్యుడి కలయిక వల్ల అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశిస్తుంది. 

బుధాదిత్య రాజయోగం ఈ రాశుల అదృష్టం
మేషం: బుధుడు సంచారం ద్వారా ఏర్పడిన బుధాదిత్య రాజయోగం మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఈ సమయం కెరీర్‌కు చాలా మంచిది.
వృషభం: వృషభ రాశి వారికి బుధుని సంచారం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనేక విధాలుగా డబ్బు వస్తుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ఆఫీసులో మీ పొజిషన్ స్థిరంగా ఉంటుంది. 
తుల రాశి: బుధాదిత్య యోగం బుధుడు రాశి మారడం వల్ల ఏర్పడిన రాజయోగం తులారాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు గొప్ప విజయాలు సాధిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి సమయం. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 
ధనుస్సు: బుధాదిత్య యోగం ధనుస్సు రాశి వారికి విజయాన్ని ఇస్తుంది. వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రజలు మీ పనిని మెచ్చుకుంటారు. మీరు వేసే ప్రణాళికలు విజయవంతమవుతాయి. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. 

Also Read: Shukra Gochar 2023: హోలీ తర్వాత ఈ 5 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Read More