Home> ఆధ్యాత్మికం
Advertisement

Laxmi Narayan Rajyog 2023: బుధుడు, శుక్రుడు కలయికతో మేషరాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులపై కాసుల వర్షం కురిపించనున్న లక్ష్మీదేవి

Laxmi Narayan Rajyog 2023: గ్రహ కదలికలు మన జీవితంలో సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. దీని కారణంగా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. 
 

Laxmi Narayan Rajyog 2023: బుధుడు, శుక్రుడు కలయికతో మేషరాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులపై కాసుల వర్షం కురిపించనున్న లక్ష్మీదేవి

Lakshmi Narayan Rajyog 2023 Effects On Zodiac Signs: గ్రహాలు మరియు నక్షత్రరాశులు కాలానుగుణంగా వాటి కదలికలను మారుస్తాయి. గ్రహ కదలికలు మనిషి జీవితంపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. ఇటీవల బుధుడు, శుక్రుడు కలిసి మేషరాశిలో లక్ష్మీనారాయణ యోగం చేశారు. ఈ యోగాన్ని జ్యోతిష్య శాస్త్రంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారిపై లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

ధనుస్సు రాశి- లక్ష్మీ నారాయణ యోగం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రత్యేక యోగం మీ రాశి నుండి రెండవ ఇంటిలో ఏర్పడబోతోంది, దీంతో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కెరీర్ మునుపటి కంటే అద్బుతంగా ఉంటుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. విద్య, మీడియా మరియు మార్కెటింగ్ రంగాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం బాగుంటుంది. 

మకరం- లక్ష్మీ నారాయణ రాజయోగం మకర రాశి వారికి చాలా ప్రత్యేకం కానుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు వేసిన ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

మీన రాశి - బుధ, శుక్ర యుతి మీన రాశి వారికి అనుకోకుండా డబ్బును ఇస్తుంది. ఈ యోగం మీ రాశి యెుక్క 11వ ఇంట్లో ఏర్పడబోతుంది. మీరు వ్యాపారంలో భారీ డీల్ ను కుదుర్చుకుంటారు. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. 

Also Read: Sun Transit 2023: ఏడాది తర్వాత మేషరాశిలోకి సూర్యభగవానుడు.. ఈ 4 రాశులకు తిరుగులేనంత ధనం..

Also Read: Tijori Vastu Tips: గురువారం ఈ వస్తువులను రహస్యంగా బీరువాలో పెట్టండి.. రాత్రిపూట అద్భుతాలు జరుగుతాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Read More