Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Shukra yuti 2023: మేషంలో మూడు గ్రహాల గొప్ప కలయిక.. ఈరాశులకు తిప్పలు తప్పవు ఇక..

Budh Gochar 2023: మార్చి 31న బుధుడు మేషరాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారు భారీగా నష్టపోనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.

Budh Shukra yuti 2023: మేషంలో మూడు గ్రహాల గొప్ప కలయిక.. ఈరాశులకు తిప్పలు తప్పవు ఇక..

Budh Shukra yuti 2023: ప్రస్తుతం మేషరాశిలో శుక్రుడు, రాహువు సంచరిస్తున్నారు. ఈనెల 31న బుధుడు మేషరాశిలోకి ప్రవేశించడంతో మూడు గ్రహాల మహా కలయిక ఏర్పడబోతుంది. ఆస్ట్రాలజీలో మేషరాశికి అధిపతిగా అంగారకుడిని భావిస్తారు. మెర్య్కూరీ, కుజుడులను శత్రువులుగా పరగణిస్తారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 21 వరకు మేషరాశిలోనే ఉంటాడు బుధుడు. మెర్క్యూరీ యెుక్క ఈ రాశి మార్పు వల్ల కొన్ని రాశులవారు సమస్యలు ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

బుధుడి గోచారం ఈ రాశులకు నష్టం

వృశ్చికం (Scorpio): మేషరాశిలో బుధుడి సంచారం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయేలా చేస్తుంది. మీరు అప్పుల నుండి బయటపడలేరు. ఆఫీసులో మీకు సమయం అస్సలు కలిసిరాదు. మీరు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోంటారు. ఆస్తి తగాదాలు ఎదుర్కోంటారు.

కుంభ రాశి (Aquarius): మెర్క్యూరీ సంచారం వల్ల మీరు మోసపోయే అవకాశం ఉంది.  మీకు ప్రతి పనిలో అపజయమే ఎదురవుతుంది. అనారోగ్యం బారిన పడే అవకాశం  ఉంది. మీపై శత్రువులు విజయం సాధిస్తారు. ఫ్యామిలీలో  గొడవలు జరుగుతాయి.

మేష రాశి (Aries): బుధుడి సంచారం మేషరాశి వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. మీరు ధనాన్ని దుబారా చేస్తారు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఈ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే మీరు చాలా నష్టపోతారు.

వృషభ రాశి(Taurus): మెర్క్యూరీ మేషరాశి ప్రవేశం వృషభరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీకు ఇతరులతో విభేదాలు తలెత్తుతాయి. ఈ సమయంలో గర్బిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

కన్యా రాశి (Virgo): బుధుడి గోచారం కన్యా రాశి వారికి అస్సలు కలిసిరాదు. మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీకు కుటుంబ సభ్యుల సపోర్టు అస్సలు లభించదు. మీరు విపరీతంగా ఖర్చు చేస్తారు. ప్రయాణాలు కలిసిరావు. ఫ్యామిలీలో గొడవలు తలెత్తుతాయి.

Also Read: Shani Gochar 2023: అరుదైన యోగం చేసిన శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More