Home> ఆధ్యాత్మికం
Advertisement

Trigrahi Yog 2023: మేషరాశిలో త్రిగ్రాహి యోగం.. మార్చి 31 నుంచి ఈ మూడు రాశులకు కష్టాలు..

Trigrahi Yog 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మరో రెండు రోజుల్లో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. మేషరాశిలో బుధుడు, శుక్రుడు మరియు రాహువు కలయిక వల్ల మూడు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.
 

Trigrahi Yog 2023: మేషరాశిలో త్రిగ్రాహి యోగం.. మార్చి 31 నుంచి ఈ మూడు రాశులకు కష్టాలు..

Trigrahi Yog In Mesh Rashi 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. ఇది మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మార్చి 31 బుధుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అప్పటికే అదే రాశిలో రాహు, శుక్రుడు సంచరిస్తారు. మేషరాశిలో బుదుడు, రాహు మరియు శుక్రుడు కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే ఈ సమయంలో మూడు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి రావచ్చు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

ఈ మూడు రాశులవారు జాగ్రత్త
కన్యా రాశి 
త్రిగ్రాహి యోగం కన్యారాశి వారికి అననుకూలంగా ఉంటుంది.  మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది, లేకుంటే మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. 
వృషభ రాశి
త్రిగ్రాహి యోగం వృషభ రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ లవ్ లో సమస్యలు వస్తాయి. పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూల సమయం కాదు.  కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. ఆఫీసులో ఈ సమయం మీకు అంతగా కలిసిరాదు. 
వృశ్చిక రాశి
త్రిగ్రాహి యోగం ఈ రాశి యెుక్క ఆరో ఇంట్లో ఏర్పడబోతుంది. దీంతో మీకు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మీరు రుణ విముక్తి పొందలేరు. మీ రిలేషన్ షిప్ లో అనేక సమస్యలు వస్తాయి. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. 

Also Read: Grah Gochar 2023: రేవతి నక్షత్రంలో కలుసుకున్న బుధుడు-బృహస్పతి.. ఈ 6 రాశుల ఇంటిపై నోట్ల వర్షం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More