Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Margi 2022: రేపటి నుండి మార్గంలోకి బుధుడు. ఈ 4 రాశులవారికి అంతులేని ఐశ్వర్యం!

Budh Margi 2022: గ్రహాల రాకుమారుడైన బుధుడు అక్టోబరు 2 నుంచి మార్గంలోకి రానున్నాడు. ఇది నాలుగు రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది. 
 

Budh Margi 2022: రేపటి నుండి మార్గంలోకి బుధుడు. ఈ 4 రాశులవారికి అంతులేని ఐశ్వర్యం!

Budh Margi 2022: గ్రహాల యువరాజు బుధుడు రేపు అంటే అక్టోబర్ 2న తన గమనాన్ని మార్చనున్నాడు. తిరోగమనం నుంచి కదలికలోకి (Budh Margi 2022) రానున్నాడు. బుధుడి సంచారం మెుత్తం 12 రాశులవారిపై విభిన్న ప్రభావాలను చూపుతుంది. ఇందులో 4 రాశులవారికి ఆదివారం నుండి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. వీరికి ఆకస్మిక ధనలాభం, కెరీర్ లో పురోగతి ఉంటుంది. రేపటి నుంచి ఎవరి అదృష్టం ప్రకాశించనుందో తెలుసుకుందాం. 

వృశ్చికం (Scorpio): ఈ రాశి వారికి బుధ గ్రహ సంచారం చాలా శుభప్రదం కానుంది. కుటుంబంలో ఐక్యత ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు పొందుతారు. 

ధనుస్సు (Sagittarius): ఈ రాశి వ్యక్తులు బుధుడు యొక్క మార్గం కారణంగా ఉద్యోగ-వ్యాపారాలలో భారీ లాభాలను పొందబోతున్నారు. వారు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందుతారు. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. బిజినెస్ విస్తరించడానికి ఇదే మంచి సమయం. మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. 

కన్య (Virgo): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశి వారి 10వ ఇంటికి బుధుడు అధిపతి. దీంతో ఈ రాశివారి కెరీర్ సక్సెస్ అవుతుంది. మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉన్న ఉద్యోగంలో బాధ్యత పెరిగే అవకాశం ఉంది. 

సింహం (Leo): ఈ రాశి వారికి బుధుని మార్గం వల్ల అనేక శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. కోర్టులో నడుస్తున్న కేసులు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

Also Read: Shukra Asta 2022: ఇవాళ అస్తమించనున్న శుక్రుడు.. మెుత్తం 12 రాశులపై పెను ప్రభావం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.        

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More