Home> ఆధ్యాత్మికం
Advertisement

Trikon Rajyoga: అరుదైన రాజయోగాన్ని ఏర్పరుస్తున్న బుధుడు.. ఈ 3 రాశులకు లక్కే లక్కు..

Trikon Rajyoga: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా భావిస్తారు. మెర్క్యూరీ గ్రహం అరుదైన కేంద్ర త్రికోణ యోగాన్ని  ఏర్పరుస్తున్నారు. ఇది కొందరికి శుభప్రదంగా ఉండనుంది. 
 

Trikon Rajyoga: అరుదైన రాజయోగాన్ని ఏర్పరుస్తున్న బుధుడు.. ఈ 3 రాశులకు లక్కే లక్కు..

Grah Gochar 2023 Trikon Rajyoga: జనవరి మరియు ఫిబ్రవరిలో చాలా గ్రహాలు రాశిచక్రాలను మార్చనున్నాయి. ఆస్ట్రాలజీలో బుధుడిని శుభగ్రహంగా భావిస్తారు. జ్ఞానం, అభ్యాసం, తెలివితేటలు మరియు తార్కిక సామర్థ్యం మొదలైన వాటికి బుధుడిని కారకుడిగా భావిస్తారు. మెర్క్యూరీ గ్రహ సంచారం వల్ల అరుదైన కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగాన్ని ఆస్ట్రాలజీలో శుభప్రదంగా భావిస్తారు. ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటుందో వారు అదృష్టవంతులనే చెప్పాలి. ఈ యోగం ఉన్నవారికీ దేనికీ లోటు ఉండదు. మకరరాశిలో బుధుడు సంచరించడం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. 

కేంద్ర త్రికోణ రాజయోగం ఈ 3 రాశులకు శుభప్రదం
మేషరాశి (Aries): మకరరాశిలో మెర్క్యురీ యొక్క సంచారం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ జాతకంలోని 10వ ఇంట్లో అరుదైన త్రికోణ  రాజయోగం ఏర్పడుతుంది. మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. సమాజంలో గౌరవం ఉంటుంది. 
మకర రాశి (Capricorn): మెర్క్యురీ యొక్క రాశి మార్పు మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పురోగతితో పాటు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. మీరు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
తులా రాశి (Libra): ఈ రాశి యెుక్క జాతకంలోని నాల్గవ ఇంట్లో బుధుడు సంచరించనున్నాడు. మెర్క్యూరీ సంచారం తులరాశి వారు అనుకూల ఫలితాలను పొందుతారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Shani Asta 2023: సొంత రాశిలోనే శనిదేవుడి అస్తమయం.. ఈ 3 రాశులవారు జాగ్రత్త.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More