Home> ఆధ్యాత్మికం
Advertisement

Mercury transit 2024: ఫిబ్రవరి 01 నుంచి ఈ 3 రాశుల సుడి తిరగబోతుంది.. ఇక వీరికి డబ్బే డబ్బు..

Mercury transit 2024: గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వచ్చే నెల 01వ తేదీన బుధుడు మకర రాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. 
 

Mercury transit 2024: ఫిబ్రవరి 01 నుంచి ఈ 3 రాశుల సుడి తిరగబోతుంది.. ఇక వీరికి డబ్బే డబ్బు..

Budh Gochar in Feb 2024: మరో వారం రోజుల్లో బుధుడు తన రాశిని మార్చబోతున్నాడు. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 2:29 గంటలకు మెర్క్యూరీ మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడి యెుక్క ఈ రాశి మార్పు కొందరికి అనుకూలంగా ఉంటుంది. మెర్క్యూరీ సంచారం వల్ల ఏయే రాశులవారు ధనవంతులు కాబోతున్నారో తెలుసుకుందాం. 

మిధునరాశి
బుధుడి గమనంలో మార్పు మిథునరాశికి ప్రయోజనకరంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. బుధుడి అనుగ్రహం వల్ల మీ పెండింగ్ లో ఉన్న పనులన్నీ కంప్లీట్ అవుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ స్కిల్స్ పెరుగుతాయి.
సింహరాశి 
ఫిబ్రవరి 1న జరగబోయే బుధ సంచారం సింహరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ ఆర్థిక సమస్యలు మరియు వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. అదృష్టం మీ  వెంటే ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. 

Also Read: Shani Asta 2024: త్వరలో అస్తమించబోతున్న శనిదేవుడు.. వీరి జీవితం అల్లకల్లోలం..

మేషరాశి
మెర్క్యురీ యొక్క సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారస్తులు లాభపడతారు. మీ దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీరు ఫిబ్రవరిలో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఏదైనా టూర్ వెళ్లే అవకాశం ఉంది. మీకు లక్ కలిసి వస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సక్సెస్ అవుతారు. 

Also Read: Love Horoscope today: ఈరోజు ఎవరి లవ్ సక్సెస్ అవుతుందో, ఎవరిది ఫట్ అవుతుందో తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More