Home> ఆధ్యాత్మికం
Advertisement

Astrology: ఈ 2 రెండు రాశులపై బుధదేవుడు అనుగ్రహం.. మీ జాతకంలో బుధుడు బలపడాలంటే ఇలా చేయండి..

Astrology:  బుధుడు...మేధస్సు, తార్కిక సామర్థ్యం మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. మీ జాతకంలో బుధుడు బలపడాలంటే ఆస్ట్రాలజీలో కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. 
 

Astrology: ఈ 2 రెండు రాశులపై బుధదేవుడు అనుగ్రహం..  మీ జాతకంలో బుధుడు బలపడాలంటే ఇలా  చేయండి..

Astrology Remedies:  ఆస్ట్రాలజీలో బుధుడిని శుభ గ్రహంగా భావిస్తారు. మెర్క్యురీ గ్రహాన్ని గ్రహాల యువరాజు అని కూడా అంటారు. ఎవరి జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటాడో వారికి సానుకూల ఫలితాలను ఇస్తాడు. ఎవరి కుండలిలో బుధుడు అశుభస్థానంలో ఉంటాడో వారు ప్రతికూల ఫలితాలను పొందుతారు. మేధస్సు, తర్కం, సంభాషణ మొదలైన వాటికి బుధ గ్రహం కారకుడిగా భావిస్తారు. సూర్యుడు మరియు శుక్రుడు మెర్క్యూరీ యెుక్క మిత్ర గ్రహాలు. చంద్రుడు మరియు మార్స్ దాని శత్రు గ్రహాలు. బుధవారం మెర్క్యురీ గ్రహానికి అంకితం చేయబడింది. ఎవరి జాతకంలో బుధుడు లగ్న గృహంలో ఉంటాడో వారు చాలా అందంగా ఉంటారు. 

ఈ రెండు రాశులపై బుధుని అనుగ్రహం 
జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహానికి మిథునం మరియు కన్య ఇష్టమైన రాశులు. ఈ రెండు రాశులపై బుధ గ్రహం యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ రెండు రాశులకు వృత్తి మరియు వ్యాపారాల్లో బుధుడి విజయాన్ని ఇస్తాడు. అంతేకాకుండా వీరు కెరీర్ లో మంచి పురోగతిని సాధిస్తారు. 

బుధ గ్రహ పరిహారాలు
జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహానికి సంబంధించిన అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. ఇవి చేయడం వల్ల జాతకంలో బుధుడి యెుక్క స్థానం బలపడుతుంది. మీరు సానుకూల ఫలితాలు పొందుతారు. కుండలిలో బుధుడి స్థానం బలపడాలంటే ఈ చర్యలు చేయండి. 
** బుధవారం నాడు గణేశుడిని, విష్ణువును పూజించండి.
** బుధవారం ఉపవాసం ఉండండి.
** బచ్చలికూర తినండి మరియు నీలం రంగు బట్టలు దానం చేయండి.
** పన్నా రత్న మరియు నాలుగు ముఖాల రుద్రాక్షను ధరించండి.

Also Read: Shukra Gochar 2023: శుక్రుడి మీనరాశి ప్రవేశం... ఈ రాశులవారికి లాటరీ తగలడం ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More