Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Gochar 2023: సూర్యుడి గమనంలో పెను మార్పు.. రేపటి నుండి ఈ రాశులకు కష్టాలు మెుదలు..

Surya Gochar 2023: రేపు సూర్యుడి రాశి మార్పు జరగబోతుంది. ఆదిత్యుడు కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశులవారికి సమస్యలు మెుదలుకానున్నాయి. 
 

Surya Gochar 2023: సూర్యుడి గమనంలో పెను మార్పు.. రేపటి నుండి ఈ రాశులకు కష్టాలు మెుదలు..

Surya Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల రాజు అయిన సూర్యుడు రేపు అంటే మార్చి 15న మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యభగవానుడు ఉదయం 6.58 గంటలకు కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఏప్రిల్ 14, 2023 మధ్యాహ్నం 3.12 గంటల వరకు అతడు మేషరాశిలోనే ఉంటారు. సూర్యుడి రాశి మార్పు కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. సూర్యుడి గమనంలో మార్పు ఏ రాశులవారిపై చెడు ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. 

సూర్య సంచారం ఈ రాశులకు నష్టదాయకం
మేషరాశి
ఈ రాశి యెుక్క పన్నెండవ ఇంట్లో సూర్యభగవానుడు సంచరిస్తున్నాడు. దీంతో మీరు చిన్న పనిని కూడా పూర్తిచేయడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. వేస్ట్ ఖర్చులు అధికముతాయి. ఈ సమయంలో చెడు వార్తలు వినే అవకాశం ఉంది. మీరు కోర్టు కేసుల్లో ఓడిపోయే అవకాశం ఉంది.
సింహరాశి 
సూర్యుడు సింహరాశి యెుక్క ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.  ఈ సమయంలో మీపై ఎవరైనా కుట్ర చేసే అవకాశం ఉంది. ఆఫీసులో కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. 
ధనుస్సు రాశి
ఈ రాశిలో సూర్యుడు నాలుగో ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. మీ జీవితంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు ఎదుర్కోవలసి రావచ్చు. మీరు చెడు వార్తలను వినే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసిరాదు. 
మకరరాశి
ఈ రాశి యెుక్క సూర్యుడు మూడవ ఇంట్లో సంచరిస్తున్నాడు. మీరు ఈ సమయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మొండిగా ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. 

Also Read: Solar Eclipse 2023: ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More