Home> ఆధ్యాత్మికం
Advertisement

Bhadrapada Masam 2022: భాద్రపద మాసం ఎప్పుడు ప్రారంభం? ఈ మాసంలో వచ్చే పండుగలేంటి?

Bhadrapada 2022:  భాద్రపద మాసం అనేక పండుగలకు నెలవు. ఈ మాసం ఆగస్టు 12న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మాసంలో వచ్చే పండుగలు, వ్రతాలేంటో తెలుసుకుందామా.
 

Bhadrapada Masam  2022:  భాద్రపద మాసం ఎప్పుడు ప్రారంభం? ఈ మాసంలో వచ్చే పండుగలేంటి?

Bhadrapada Masam  2022: మరో రెండు రోజులు అంటే ఆగస్టు 12 శుక్రవారం నుండి భాద్రపద మాసం ప్రారంభం కానుంది. పూర్ణిమనాడు పూర్వాభాద్ర కాని లేక ఉత్తరాభాద్ర నక్షత్రంలో చంద్రుడు ఉండే మాసాన్ని భాద్రపద మాసం అని పిలుస్తారు. భాద్రపద మాసంలోనే (Bhadrapada Masam  2022) శ్రీ కృష్ణ జన్మాష్టమి, హర్తాళికా తీజ్, గణేష్ చతుర్థి, రాధా అష్టమి, అనంత చతుర్దశి, భాద్రపద అమావాస్య, భాద్రపద పూర్ణిమ, మాస శివరాత్రి, ప్రదోష వ్రతం, ఋషి పంచమి వంటి అనేక పండుగలు వస్తాయి. 

భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం యొక్క ప్రతిపద తేదీ ఆగస్టు 12వ తేదీ శుక్రవారం ఉదయం 05:58 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే రోజు సౌభాగ్య యోగం, శోభన యోగం కూడా ఏర్పడుతున్నాయి. ఈ మాసం దేవతా పూజలకు, పితృదేవతల పూజకు అనుకూలమైన మాసం.  ఈ నెలలో దశావతార వ్రతం  చేస్తారు.

భాద్రపద 2022 మాసం వ్రతాలు, పండుగలు:
ఆగష్టు 12, శుక్రవారం: భాద్రపద మాసం ప్రారంభం
ఆగస్ట్ 14, ఆదివారం: కజారి తీజ్, బుధి తీజ్ లేదా సతురి తీజ్
ఆగష్టు 15, సోమవారం: బహుళ చతుర్థి, సంకష్టి చతుర్థి ఉపవాసం
ఆగష్టు 17, బుధవారం: సింహ రాశి సంక్రాంతి
ఆగస్ట్ 18, గురువారం: శ్రీ కృష్ణ జన్మాష్టమి
ఆగష్టు 23, మంగళవారం: అజ ఏకాదశి
ఆగస్టు 24, బుధవారం: ప్రదోష వ్రతం
ఆగష్టు 25, గురువారం: మాస శివరాత్రి
ఆగష్టు 27, శనివారం: భాద్రపద అమావాస్య
ఆగష్టు 28, ఆదివారం: భాద్రపద శుక్ల పక్షం ప్రారంభం
ఆగస్టు 30, మంగళవారం: హర్తాళికా తీజ్
ఆగష్టు 31, బుధవారం: గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి

Also Read: Angarak Yog: ఇవాళ అంగారక యోగం నుండి ఈ 3 రాశులకు విముక్తి .. ఇక అన్నీ మంచి రోజులే! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Read More